Telugu News » Blog » Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. కారణం అదే!

Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. కారణం అదే!

by Bunty
Ads

టాలీవుడ్ మాస్ సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ సాధారణ టీవీ జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన సింగర్ మంగ్లీ… ప్రస్తుతం టాలీవుడ్ లోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది. చిత్ర పరిశ్రమలో మాస్ సాంగ్ లు పాడాలంటే… ప్రతి ఒక్కరూ మంగ్లీకే ఆఫర్ ఇస్తున్నారు. దీంతో ఆమె క్రేజ్ ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. ఇదంతా పక్కకు పడితే తాజాగా సింగర్ మంగ్లీ కి ఊహించని పరిణామం ఎదురైంది.

Advertisement

 

సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. కర్ణాటకలోని బళ్లారిలో ఈ ఘటన జరిగింది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. ఆమె కారుపై కొందరు వ్యక్తులు రాళ్లదాడి చేశారు. ఈ వేడుకకు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Advertisement

Advertisement

కాగా, గత కొన్ని రోజుల కిందట, చిక్క బల్లాపూర్ లోనూ జరిగిన ఓ కార్యక్రమంలో సింగర్ మంగ్లీ హాజరయ్యింది. అయితే ఆ సమయంలో కన్నడలో మాట్లాడాలని మంగ్లీని ప్రముఖ యాంకర్ అనుశ్రీ కోరింది. అయితే దానికి అంగీకరించని మంగ్లీ… ఏదో బలవంతంగా రెండు ముక్కలు కన్నడలో మాట్లాడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసినా కొందరు కన్నడీలు.. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో కింద కామెంట్లు పెడుతూ.. బండ బూతులు తిట్టారు. అక్కడితో ఆగకుండా తాజాగా కర్ణాటక నుంచి తెలంగాణకు వస్తున్న సమయంలో… ఆమె కారుపై దాడి చేశారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.