Home » నాగచైతన్య ‘తండేల్’ గ్లింప్స్ మామూలుగా లేవుగా..!

నాగచైతన్య ‘తండేల్’ గ్లింప్స్ మామూలుగా లేవుగా..!

by Anji
Ad

అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు అక్కినేని నాగచైతన్య. ఇక యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి, ప్రముఖ నిర్మాత సంస్థ గీత ఆర్ట్స్ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ తండేల్. అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.


ఇందులో సాయి పల్లవి కథానాయకగా నటిస్తుండగా, చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీ కొద్ది రోజుల క్రితమే హైదరాబాదులో ఘనంగా ప్రారంభమైంది. నాగచైతన్య ఈ చిత్రంలో మత్స్యకారుడిగా నటించడానికి బీస్ట్ మోడ్ లోకి మారారు. కండలు తిరిగిన దేహం కోసం గత కొన్ని నెలలుగా ఆయన కష్టపడ్డారు.

Advertisement

Advertisement

పొడవాటి జుట్టు, గడ్డంతో రాగ్గడ్ లుక్ లో నాగచైతన్య కనిపిస్తారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ గ్లింప్స్ విడుదల చేశారు. ఎసెన్స్ ఆఫ్ తండేల్ అంటూ ఈ గ్లింప్స్ విడుదల చేయగా, వీడియోతోనే కథ చెప్పేసాడు దర్శకుడు. బతుకుదెరువు కోసం గుజరాత్ లోని వీరవల్ కు వెళ్లిన నాగచైతన్య సముద్ర వేట చేస్తూ పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు చిక్కుతాడు. అయితే పాకిస్తాన్ జైలు నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనే స్టోరీ తో ఈ సినిమా రానుంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading