Home » నాగార్జున చేసిన ఆ మిస్టేక్ వల్లనే నాగచైతన్య టాప్ హీరో కాలేకపోయాడా ?

నాగార్జున చేసిన ఆ మిస్టేక్ వల్లనే నాగచైతన్య టాప్ హీరో కాలేకపోయాడా ?

by Anji
Ad

అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో నాగార్జున ఎక్కువగా క్లాస్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన శివ సినిమాతో మాస్ హీరోగా మారాడు నాగార్జున. అప్పటి నుంచి అటు క్లాస్ ఇటు మాస్ అని తేడా లేకుండా వరుస సినిమాలను చేస్తే ఇండస్ట్రీలో ఓ టాప్ హీరోగా కొనసాగుతున్నారు. 

Advertisement

నాగార్జున తరువాత అక్కినేని వంశం నుంచి వచ్చిన హీరో నాగచైతన్య ఈయన జోష్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. తన సినిమానే ఫ్లాప్ గా నిలిచింది. ఆ తరువాత ఏం మాయ చేసావే మూవీ మంచి సక్సెస్ సాధించింది. కానీ ఆ తరువాత మాస్ హీరోగా ఎదగాలనే ప్రయత్నం చేసి విఫలం చెందాడు. ముఖ్యంగా నాగార్జున తనకు సెట్ అయ్యే క్లాస్ సినిమాలు చేయమని చెప్పడంతో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 100%లవ్ మంచి సక్సెస్ ని ఇచ్చింది.  

Advertisement

Also Read :  సుమంత్ కీర్తి రెడ్డికి విడాకులు ఇవ్వడం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా..?

Manam News

అలాంటి సినిమాలు చేస్తే నాగచైతన్య టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా మిగిలేవాడు. ఇప్పుడు అటు మాస్.. ఇటు క్లాస్ కాకుండా పోయాడు. ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలతో హిట్స్ అందుకుంటున్నప్పటికీ ఆయన స్టార్ హీరోగా మాత్రం ఎదగలేకపోయారు. ప్రస్తుతం ఆయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు నాగచైతన్య. ఈ మూవీతో మంచి సక్సెస్ సాధిస్తే ఓ మంచి హీరోగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటారు. లేదంటే డిజాస్టర్ హీరోగా పేరు సంపాదించు అవకాశం లేకపోలేదు. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరి. 

Also Read :  చిరంజీవి సినిమాల్లోనే కాకుండా సీరియ‌ల్స్ లోనూ న‌టించార‌ని తెలుసా..ఆ సీరియ‌ల్ ఏదంటే..?

Visitors Are Also Reading