Home » చిరంజీవి సినిమాల్లోనే కాకుండా సీరియ‌ల్స్ లోనూ న‌టించార‌ని తెలుసా..ఆ సీరియ‌ల్ ఏదంటే..?

చిరంజీవి సినిమాల్లోనే కాకుండా సీరియ‌ల్స్ లోనూ న‌టించార‌ని తెలుసా..ఆ సీరియ‌ల్ ఏదంటే..?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో కామ‌న్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. కెరీర్ ప్రారంభంలో చిరంజీవి ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. బ్యాగ్రౌండ్ లేక‌పోవ‌డంతో చిరు ఎలాంటి పాత్ర వ‌చ్చినా నో చెప్పుకుండా న‌టించేవారు. ఈ క్ర‌మంలోనే ప్రారంభంలో చిరు విల‌న్ వేశాలు కూడా వేశారు. అలా అంచెలంచెలుగా ఎదిగి అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ స్టార్ హీరోగా రానిస్తున్నారు.

Advertisement

కేవ‌లం తాను ఒక్కడే హీరో అవ్వ‌కుండా త‌న సోద‌రుడిని ప‌వ‌ర్ స్టార్ ను చేశాడు. ఇక మ‌రో త‌మ్ముడిని కూడా బుల్లితెర‌పై ట‌వ‌ర్ స్టార్ ను చేశాడు. ప్ర‌స్తుతం చిరు కుమారుడితో పాటూ నాగ‌బాబు కుమారుడు మ‌రియు అల్లుల్లు కూడా స్టార్స్ గా రానిస్తున్నారు. అయితే ఎవ్వ‌రికీ తెలియ‌ని నిజం ఒక‌టి ఉంది. చిరంజీవి ఒక‌ప్పుడు టీవీ సీరియ‌ల్ లో కూడా న‌టించారు.

Advertisement

చిరంజీవి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన కొత్త‌లో ఓ హిందీ సీరియ‌ల్ లో కూడా న‌టించారు. ఆ సీరియ‌ల్ పేరు ర‌జ‌నీ కాగా చిరంజీవి ఈ సీరియ‌ల్ లో గెస్ట్ రోల్ లో న‌టించారు. ఇక ఆ త‌ర‌వాత‌నే చిరంజీవికి సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయి. దాంతో ఆయ‌న సీరియ‌ల్స్ ను వ‌దిలేసి పూర్తిగా సినిమాల‌లో బిజీగా మారిపోయారు. ఇక సినిమాల‌లో మొద‌ట చిన్న చిన్న పాత్ర‌లు చేసిన‌ప్ప‌టికీ ఆ త‌ర‌వాత హీరో అవ‌కాశాలు అందుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇక ప్ర‌స్తుతం చిరు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఇటీవలే వాల్తేరు వీర‌య్య సినిమాతో సూప‌ర్ హిట్ ను అందుకున్నారు. అంతేకాకుండా ఫ్యూచ‌ర్ లోనూ క్రేజీ ప్రాజెక్ట్ ల‌తో చిరంజీవి రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే చిరంజీవి నెక్స్ట్ సినిమా భోళా శంక‌ర్ సినిమా షూటింగ్ వేగంగా జ‌రుపుకుంటోంది. ఈ సినిమా నుండి ఇటీవ‌ల పోస్ట‌ర్ ల‌ను విడ‌దుల చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ALSO READ : ఆ విషయం లో సపోర్ట్ చెయ్యనందుకే విజయశాంతి- చిరు మధ్య 20 ఏళ్ళు మాటలు లేవా ?

Visitors Are Also Reading