టాలీవుడ్లో ఫ్యామిలీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు కృష్ణవంశీ. సినిమా సినిమాకు మధ్య గ్యాబ్లో గోదావరి జిల్లాలలో గడపడం కృష్ణవంశీకి అలవాటు. ఫ్రెండ్స్‌తో ముచ్చటించేవారు. అకస్మాత్తుగా ఫిరోజ్‌గాంధీ, ఇందిరాగాంధీ, సంజయ్‌గాంధీ, రాజీవ్‌గాంధీ ఇలా ఆ కుటుంబం మొత్తం అకస్మిక దుర్మరణాలే. ఎందుకంటావని ఆసక్తిగా అడిగారు తన ఫ్రెండ్స్‌ను కృష్ణవంశీ. అప్పుడు ఆయుర్వేద డాక్టర్ గున్నేశ్వర్రావు శాపం అని పేర్కొన్నారు.
Advertisement
మహేష్‌బాబు కోసం కథ ఆలోచిస్తున్న సమయంలోనే నిర్మాత నుంచి ఫోన్ వచ్చింది అప్పటికే సార్ మీ పని మీదనే ఉన్నానని సమాధానం చెప్పాడు. సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమాని రామలింగేశ్వరరావు కృష్ణతోనే కిరాయి కోటిగాడు, దొంగోడు వచ్చాడు వంటి సినిమాలను తీశాడు. మహేష్‌బాబుతో కృష్ణవంశీ దర్శకత్వంలో సినిమా చేయాలనేది ఆయన టార్గెట్. కృష్ణవంశీకి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టం ఉండదు. మంచి కథ దొరికినప్పుడు చేస్తానని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ నిర్మాత వదలలేదు. కృష్ణవంశీ ఏ పని చేసినా మహేష్ గురించే ఆలోచన. మహేష్ అందగాడు. బృందావనంలో కృష్ణుడిలాగా ఉంటాడు తనతో ఎలాంటి సినిమా చేయాలనే తర్జన భర్జనలో పడ్డాడు కృష్ణవంశీ.
ముఖ్యంగా బృందావనం లాంటి కృష్ణుడి మాదిరిలా అని మైండ్‌లో ఫిక్స్ చేసుకున్నాడు. ఈ బృందావనానికి ఆ శాపం కలిపితే ఓక్లారిటీ వచ్చింది. ఇక వెంటనే కృష్ణవంశీ పద్మాలయ స్టూడియోకు వెళ్లి కృష్ణ, మహేష్‌బాబు, నిర్మాత రామలింగేశ్వరరావులకు కథ చెప్పారు. ఈ కథ విని ఎవ్వరూ ఏమి మాట్లాడటం లేదు.కృష్ణ ఏదైనా ముక్కుసూటిగా మొహం మీదనే చెప్పేస్తుంటారు. వంశీ నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు. కానీ కథ బాగున్నట్టు అనిపిస్తుందని చెప్పాడు. నువ్వు మహేష్ ఓ నిర్ణయానికి రండి అని చెప్పి వెళ్లిపోయాడు కృష్ణ.. మహేష్‌కు ఏమో కృష్ణవంశీతో మంచి లవ్ స్టోరీ చేయాలని ఉందట. ఇతనేమో బృందావనం, శాపం అంటున్నాడు. కృష్ణవంశీని కన్వీన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు నిర్మాత. అసలే కృష్ణవంశీ మొండివాడు కావడంతో వెంటనే కృష్ణవంశీ ముగ్గురు అమ్మాయిలతో మరొక కథ సిద్ధం చేశాడు.
Also Read : ఐపీఎల్ మెగా వేలంలో ఇబ్బందిగా మారిన ఈ తెలుగు వ్యక్తి గురించి మీకు తెలుసా..?
ఈ కథను విని భలే ఉందే అన్నారు కృష్ణ. మహేష్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. కానీ ఈ కథతో సినిమా చేస్తే బ్లాక్‌బస్టర్ హిట్ కావచ్చు. కానీ ఆ కథతో సినిమా అయితే మాత్రం దాదాపు 20 ఏళ్ల పాటు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారట. ఆలోచించుకోండి ఈ కథ మీకు ఇచ్చేస్తాను, వేరే డైరెక్టర్‌తో చేయించుకోండి అని చెప్పాడట. ఇక నిర్మాత రామలింగేశ్వరరావు తలపట్టుకున్నాడు. అసలు కృష్ణవంశీతో ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా అని తర్జన భర్జన పడ్డారట. ఇక మహేష్ కృష్ణవంశీని నమ్మాడు. కృష్ణవంశీ కథను నమ్మాడు. నిర్మాత రామలింగేశ్వరరావు ఈ కాంబినేషన్‌ను నమ్మాడు. ఇక ప్రాజెక్ట్ ప్రారంభం అయింది.
Advertisement
కథ ప్రారంభమైంది కానీ క్లైమాక్స్‌ను ఎలా డీల్ చేయాలో దర్శకునికి అర్థం కాలేదట. ఎప్పటికో ముడివీడింది. అమ్మవారి శాపాన్ని ఎక్కువ హైలెట్ చేస్తున్నామా అనేది పెద్ద డౌట్. గురువు సిరివెన్నెల సీతారామశాస్త్రిని కలిశాడు. దీంతో ఆయన డౌట్లు అన్ని తీర్చేశాడు. కృష్ణవంశీ పుల్ క్లారిటీ వచ్చింది. తొలుత టైటిల్ కృష్ణ ముకుంద మురారి అనుకున్నాడు. మురారి అని సింపుల్‌గా పెడితే బెటర్ కదా అన్నాడు రామలింగేశ్వరరావు. ఇక ఈ సినిమా నిండ ఆర్టీస్టులే. బామ్మ పాత్రకు బెంగళూరు వెళ్లి మరీ షావుకారీ జానకమ్మకు కథ చెప్పారు. 40 రోజులు కేటాయించాలంటే కష్టం అని చెప్పిందట. ఫైనల్‌గా మలయాళ నటీ సుకుమారి సెలెక్ట్ అయిందట. మహేష్ పక్కన హీరోయిన్ అంటే అందంగా ఉండాలి.
హేమమాలిని కూతురు ఇషా డియోల్ అయితే బాగుంటుందనిపించింది. హేమమాలిని దగ్గరికీ వెళ్లితే.. రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు అని మొహం మీద అడిగేసిందట. సొనాలిబింద్రే హైదరాబాద్‌లో ఫ్రెండ్ పెళ్లికి వచ్చి కథ విని కాల్షిట్స్ ఇచ్చేసింది. ఫుల్ ట్రెడిషనల్ సినిమా ఇది. విలేజ్ అట్మాస్పియర్, పండుగ వాతావరణం లాంటివి కావాలి. ఆర్ట్ డైరెక్టర్ అనుభవజ్క్షుడే ఉండాలి. సమర్థుడైనటువంటి శ్రీనివాసరాజు కృష్ణవంశీ కథ చెప్పగానే స్కెచ్ వేశాడు. కేరళ, కర్నాటక వెళ్లితే ఖర్చు ఎక్కువ అవుతుందని.. శంషాబాద్ టెంపుల్‌కు ఫిక్స్ అయ్యారు. కృష్ణవంశీ కెమెరామెన్‌గా రాంప్రసాద్‌కు అవకాశం కల్పించారు. మణిశర్మ బెస్ట్ అని ఫీలయ్యాడు. క్లైమాక్స్‌లో కీలక పాత్ర కోసం కీలక నటుడు ఉంటే బాగుంటుందనుకున్నారు.
అయితే ఎన్టీఆర్ నటించిన దానవీరశూరకర్ణ సినిమాలో శకునిగా నటించిన దూళిపాళ్ల రిటైర్డ్ అయి గుంటూరుకు సమీపంలో స్థిరపడ్డారు. కృష్ణవంశీ వెళ్లి ఒప్పించారు. 5నెలల షూటింగ్, రోజుకు 12 గంటల వరకు పని చేశారు. కృష్ణవంశీకి స్క్రిప్ట్ అంతా మైండ్‌లోనే మెదులుతుంది. ఆర్టిస్ట్‌లు కూడా బాగా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. ఇక మహేష్‌బాబు అయితే క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేశాడు. 104 జ్వరంతో కూడా గోదావరి ఒడ్డున డుండుం నటరాజ్ పాట, ఫైట్ చేశారు. ముఖ్యంగా కృష్ణవంశీ ఏది అడిగినా ఇచ్చేసేయండని నిర్మాత రామలింగేశ్వరరావు ప్రొడక్షన్ టీమ్‌కు ఆర్డర్ ఇచ్చేశాడు. 2001 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ కుదరలేదు. 3 గంటల 10 నిమిషాల నిడివితో తొలికాపీ రెడీ అయింది. కొంచెం ఎడిట్ చేయాలనుకుంటే కృష్ణవంశీ వినలేదు. తనకు ఒకే నమ్మకం. ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ తీయలేము అని.
తొలుత డివైడ్ టాక్ వినిపించినా సూపర్ హిట్ కావడం మాత్రం ఖాయమని నమ్మాడు. ఫిబ్రవరి 16, 2001న విడుదల అయింది. సినిమా పెద్దగా ఉందని డిస్ట్రిబ్యూటర్లు కటింగ్ చేస్తున్నారు. కృష్ణవంశీ కయ్యుమంటున్నారు. మహేష్ మురారికి ముందు హిందీ సినిమా శక్తి వచ్చింది. వాళ్ల బద్రర్ రెండు రోజులు ప్రయత్నిస్తే ఫోన్ లో దొరికాడట. ట్యాంక్స్రా అన్నాడు కృష్ణవంశీ. నేను ఇంకా కంగ్రాట్స్ చెప్పలేదు అన్నయ్య అనగానే నువ్వు అది చెప్పడానికే ఫోన్ చేశావని నాకు తెలుసు అని నవ్వాడట. సంకల్పం ఓ కల్పవృక్షం. మనం బలంగా ఏది కోరుకుంటే అదే ఇస్తుంది అని మురారి సినిమా మనకు చెప్పే జీవిత సత్యాలు.
Also Read : జబర్దస్త్ లో లేడీస్ కు లైఫ్ ఇచ్చిన సత్యశ్రీ ఎవరు..? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి..!