Home » ఐపీఎల్ మెగా వేలంలో ఇబ్బందిగా మారిన ఈ తెలుగు వ్య‌క్తి గురించి మీకు తెలుసా..?

ఐపీఎల్ మెగా వేలంలో ఇబ్బందిగా మారిన ఈ తెలుగు వ్య‌క్తి గురించి మీకు తెలుసా..?

by Anji
Ad

ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు విజ‌యవంతంగా ముగిసింది. ప్లేయ‌ర్ల అనౌన్స్ చేసే ఎడ్మీడ్ డ‌యాస్‌కు గుండెపోటు రావ‌డంతో అత‌న్ని ఆసుప‌త్రిఇక తీసుకెళ్లారు. అనంత‌రం కామెంట‌ర్ చారు శ‌ర్మ వేలం నిర్వాహ‌క బాధ్య‌త‌లు తీసుకున్నాడు. ఇక ఇవాళ రెండ‌వ రోజు మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కానుంది. అయితే ఐపీఎల్‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ అత్యంత నిల‌క‌డ‌మైన జ‌ట్టులో ఒక‌టి. చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రువాత జ‌ట్టు బెస్ట్ ప‌ర్పామెన్స్ హైద‌రాబాద్ అనే చెప్ప‌వ‌చ్చు.

Advertisement

 

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ 2016లో ఛాంపియ‌న్‌గా కూడా నిలిచింది. స‌న్‌రైజ‌ర్స్ అంటే ట‌క్కున గుర్తుకు వ‌చ్చేది ఓపెన‌ర్లు. మిడిలార్డ‌ర్ కాస్త వీక్‌గా ఉన్నా బౌల‌ర్లు. ఓపెన‌ర్ల‌తో సూప‌ర్ స‌క్సెస్ అయింది. అయితే 2021లో స‌న్ రైజ‌ర్స్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఈ త‌ప్పుల‌ను స‌రిచేసుకుని మెగావేలంలో మంచి ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేస్తుంద‌నుకున్న తొలిరోజు ఆక్ష‌న్‌లో అభిమానుల మ‌తిపోయే విధంగా నిర్ణ‌యాలు తీసుకుంది ఈ జ‌ట్టు.

Also Read :  PRATHYUSHA : అందాల తార ప‌త్యూష విష‌యంలో అంత దారుణం జరిగిందా..!

Advertisement

ముఖ్యంగా నిన్న జ‌రిగిన మెగావేలంలో అంద‌రికీ ఇబ్బందిగా మారాడు కిర‌ణ్ కుమార్ గ్రాంధి. మెరుగైన ఆట‌గాళ్ల‌ను కొన‌డంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది. ఇందుకు కిర‌ణ్‌కుమార్ గ్రాంధి తోడ‌య్యాడు. ప్లేయ‌ర్ల‌ను తీసుకోవ‌డంలో స‌న్‌రైజ‌ర్స్ ఇలా ఎందుకు వ్య‌వ‌హ‌రించిందో అర్థం కాకుండా పోయింద‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. మ‌రొక వైపు అద్భుత‌మైన ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఈసారి టైటిల్‌ను కైవ‌సం చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని పేర్కొంటున్నారు. తొలిరోజు 10 ప్లేయ‌ర్ల‌ను ద‌క్కించుకుంటే అందులో అవ‌స‌రం వ‌చ్చే ఇద్ద‌రు లేదా ముగ్గురు మాత్ర‌మే ఉన్నారు. ముఖ్యంగా అభిషేక్ శ‌ర్మ కోసం రూ.6.50 కోట్లు ఎందుకు వెచ్చించిందో తెలియ‌దు. అదే మొత్తానికి వార్న‌ర్ దొరికేవాడు.

తొలి రోజు వేలం మ‌నం చూసిన‌ట్ట‌యితే స‌న్ రైజ‌ర్స్ టీమ్ ఉన్న హెడ్ కోచ్ మూడీ, బౌలింగ్ కోచ్ ముర‌ళీధ‌ర‌న్, బ్యాటింగ్ కోచ్ లారా ఏమి చేశారో ఎవ‌రికీ అర్థం కాలేదు. మిగ‌తా టీమ్ ఓన‌ర్లు త‌మ కోచింత్ స్టాప్తో చ‌ర్చించి ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేస్తే.. స‌న్ రైజ‌ర్స్ కో ఓన‌ర్ కావ్య మార‌న్ మాత్రం త‌న ప‌క్క‌న ఉన్న వ్య‌క్తితో చ‌ర్చించి ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయాలో లేదో నిర్ణ‌యం తీసుకుంది. ఆ వ్య‌క్తి ఫోన్‌లో ఎవ‌రితో మాట్లాడాడో తెలియ‌దు కానీ తొలిరోజువేలంలో హైద‌రాబాద్‌కు క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అన్ని అత‌డే అయ్యాడు. రెండ‌వ రోజు ఎలాంటి ప్లేయ‌ర్ల‌ను కొంటుందో చూడాలి.

Also Read :  12th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Visitors Are Also Reading