Home » JABARDASTH : జ‌బ‌ర్ద‌స్త్ లో లేడీస్ కు లైఫ్ ఇచ్చిన స‌త్య‌శ్రీ ఎవ‌రు..? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి..!

JABARDASTH : జ‌బ‌ర్ద‌స్త్ లో లేడీస్ కు లైఫ్ ఇచ్చిన స‌త్య‌శ్రీ ఎవ‌రు..? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి..!

by AJAY
Ad

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో మొద‌ట్లో రోజా అన‌సూయ ర‌ష్మి త‌ప్ప మిగితావాళ్లంతా పురుషులే. ఇక స్కిట్ ల‌లో మ‌హిళ‌ల అవ‌స‌రం వచ్చినప్పుడు పురుషుల‌కే గెట‌ప్ వేసి మ్యానేజ్ చేశారు. కొంత మంది ట్రాన్స్ జెండ‌ర్ ల‌కు కూడా లైఫ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు అమ్మాయిలా హ‌వా జ‌బ‌ర్ద‌స్త్ లో పెరిగిపోయింది. అయితే జ‌బ‌ర్ద‌స్త్ లో అమ్మాల‌కు పునాది వేసింది మాత్రం స‌త్య‌శ్రీనే అని చెప్పాలి.

ALSO READ : PRATHYUSHA : అందాల తార ప‌త్యూష విష‌యంలో అంత దారుణం జరిగిందా..!

Advertisement

JABARDASTH SATHYA SRI

స‌త్య‌శ్రీ మొద‌ట‌గా చ‌మ్మ‌క్ చంద్ర టీం ద్వారా పరిచ‌యం అయ్యింది. చంద్ర ఎక్కువ‌గా భార్యా భ‌ర్త‌ల స్కిట్ లు చేస్తుంటాడు కాబ‌ట్టి స‌త్య‌శ్రీని త‌న టీం లోకి తీసుకున్నాడు. ఇక స‌త్య‌శ్రీ ఎలాంటి డ‌బుల్ మీనింగ్ డైలాగులు లేకుండా సాఫ్ట్ కామెడీతో త‌న న‌ట‌నతో ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తోంది. అయితే స‌త్య‌శ్రీ గురించి చాలా మందికి తెలియ‌దు. కాబ‌ట్టి జ‌బ‌ర్ద‌స్త్ లో మొద‌గా ఎంట్రీ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్న ఆమె గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందా.

Advertisement

స‌త్య‌శ్రీ జ‌బ‌ర్ద‌స్త్ లోకి ఎంట్రీ ఇవ్వ‌క‌ముందు కొన్ని సినిమాల‌లో చిన్న చిన్న పాత్ర‌లు చేసింది. అంతే కాకుండా షార్ట్ ఫిల్మ్ ల ద్వారా కూడా స‌త్య శ్రీ గుర్తింపు తెచ్చుకుంది. ఇక జ‌బ‌ర్ద‌స్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర‌వాత స‌త్య‌శ్రీ ఫేట్ మారిపోయింది. చంద్ర టీం తో ఎంట్రీ ఇవ్వ‌డం ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ భాగా వ‌ర్కౌట్ అవ్వ‌డంతో ఆమె క్రేజ్ పెరిగిపోయింది. ఇదిలా ఉండ‌గా జ‌బ‌ర్ద‌స్త్ నుండి చాలా మంది క‌మెడియ‌న్ లు వెళ్లిపోగా స‌త్య‌శ్రీ కూడా చంద్ర‌తో పాటే వెళ్లిపోయింది.

ప్ర‌స్తుతం చంద్ర స్కిట్ తో పాటూ స‌త్య‌శ్రీ ధన్ రాజ్ వేణు స్కిట్ ల‌లో కూడా న‌టిస్తూ న‌వ్విస్తోంది. ఇక స‌త్య‌శ్రీ ఎంట్రీ త‌ర‌వాత జ‌బ‌ర్ద‌స్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో ఫైమా, రోహిణి, వ‌ర్ష లు ఉన్నారు. వారికి కూడా క్రేజ్ పెరిగిపోయింది. ఇదిలా ఉంటే స‌త్య‌శ్రీ రాజాది గ్రేట్, సిల్లీ ఫెలోస్, సర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల‌లో న‌టించింది. ప్ర‌స్తుతం ప‌లు చిత్రాల‌లో న‌టిస్తోంది.

Visitors Are Also Reading