Telugu News » ఎంతో ఘనంగా జరగాల్సిన మహేష్, నమ్రతల వివాహం ఎందుకు సింపుల్ గా జరిగింది ?

ఎంతో ఘనంగా జరగాల్సిన మహేష్, నమ్రతల వివాహం ఎందుకు సింపుల్ గా జరిగింది ?

by AJAY MADDIBOINA

టాలీవుడ్ లోని బ్యూటిఫుల్ కపుల్స్ లో మహేష్ బాబు నమ్రత ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరిదీ అన్యోన్యమైన బంధం. చాలామంది సినిమా తారలు పెళ్లిళ్లు చేసుకున్నారు.

Ads

ఆ తర్వాత అనేక కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. కానీ నమ్రత మహేష్ బాబు మాత్రం ఎంతో అన్యోన్యంగా ఉంటూ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నమ్రత మహేష్ బాబుకు ఎంతో సపోర్టివ్ గా ఉంటారు. కుటుంబాన్ని మహేష్ బాబును చూసుకోవడానికి సినిమాలకు పూర్తిగా గుడ్బై చెప్పారు. తన జీవితం తన భర్త మ‌హేశ్ బాబే అనుకున్నారు.

Mahesh Babu and Namrata Shirodkar'smarriage

Mahesh Babu and Namrata Shirodkar’smarriage

 

మహేష్ బాబు కూడా అనేక సందర్భాలలో తనకు నమ్రత చాలా సపోర్ట్ ఇస్తుంద‌ని చెప్పారు. తాను తీసుకునే ఆహారం నుండి ప్రతి విషయం ప‌ట్ల న‌మ్ర‌త‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. తాను ఈ స్థానంలో ఉండటానికి కూడా కార‌ణం న‌మ్ర‌త‌నే అంటూ చెప్పారు. ఇక వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు నమ్రత కలిసి వంశీ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా 2000 సంవత్సరంలో విడుదలైంది.

ఈ సినిమా సమయంలోనే నమ్రత మహేష్ బాబు ప్రేమలో పడ్డారు. మొదట వీరి పెళ్లికి మహేష్ బాబు తండ్రి కృష్ణ నిరాకరించారని అప్పట్లో వార్తలు వినిపించాయి. హీరోయిన్ ను పెళ్ళి చేసుకోవడం కృష్ణ‌కు ఇష్టం లేదని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా నమ్రత తెలుగు అమ్మాయి కాకపోవడం వల్ల కృష్ణ పెళ్లికి నిరాక‌రించార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

మొత్తానికి సూపర్ స్టార్ కృష్ణను మహేష్ బాబు ఒప్పించారని ప్రచారం కూడా జరిగింది. ఇక నమ్రత మహేష్ బాబు ల వివాహం 2005లో చెన్నైలో జరిగింది. చాలా సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరిగింది. అయితే దీనికి కారణం కూడా మహేష్ బాబు తండ్రి కృష్ణ పెళ్ళికి ఒప్పుకోక పోవడమే అని అప్పట్లో వార్తలు వినిపించాయి.

ALSO READ :

ఎన్టీఆర్ కొండ‌వీటి సింహంలో చిరును త‌ప్పించి మోహ‌న్ బాబుకు ఛాన్స్…తెర‌వెన‌క క‌థ ఇదే..!

దాని వల్ల ఆరేళ్ల పాటు బాధపడ్డా…నెటిజన్లతో సమంత ఎమోషనల్ కామెంట్స్…!


You may also like