Home » మొహ‌ర్రం పండుగ మ‌న దేశానికి ఎలా వ‌చ్చిందో తెలుసా..?

మొహ‌ర్రం పండుగ మ‌న దేశానికి ఎలా వ‌చ్చిందో తెలుసా..?

by Anji
Ad

ప్ర‌పంచ వ్యాప్తంగా ముస్లిం ప్ర‌జ‌లు రంజాన్, బ‌క్రీద్ పండుగ‌ల త‌రువాత అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకునే పండుగ‌ల‌లో మొహ‌ర్రం ఒక‌టి. దాదాపు 10 రోజుల పాటు జ‌రుపుకునే ఈ పండుగ సంద‌ర్భంగా ఇస్లాంకి సంబంధించిన ప్ర‌వ‌చ‌నాలు, మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త బోధ‌న‌లు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా ముస్లింలు విశ్వ‌సించే హిజ్రీ క్యాలెండ‌ర్‌లో నూత‌న సంవ‌త్స‌ర ప్రారంభ మాస‌మే మొహ‌ర్రం. ఇస్లాం మ‌త ప్ర‌ధాన ప్ర‌వ‌క్త మ‌హ్మ‌ద్ స‌ల్ల‌ల్లాహు అలైవ స‌ల్లం మ‌న‌వ‌డు ఇమామె హుసేన్, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఈనెల‌లోనే వీర‌మ‌ర‌ణం పొందారు. అందుకే వారి వీర‌త్వాన్ని స్మ‌రిస్తూ వారి పేర్లలో పీర్ల‌ను ప్ర‌తిష్టిస్తారు. అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ప్రార్థ‌న‌లు, సంప్ర‌దాయబ‌ద్ధంగా వివిధ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు.

 


61వ హిజ్రీ కాలంలో అప్ప‌టి రాజు అమీర్ మౌలానా త‌న కుమారుడు య‌జీద్‌కు వార‌స‌త్వంగా రాజ్యాధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. ఇమామె హుసేన్ దీనిని వ్య‌తిరేకించాడు. ప్ర‌జ‌ల యొక్క అభిప్రాయం మేర‌కు రాజు ఎంపిక జ‌ర‌గాల‌ని, అందుకు భిన్నంగా వార‌సుల‌కు రాజ్యాధికారం అప్ప‌గించ‌డం ఇస్లాం మ‌తానికి విరుద్ధ‌మ‌ని పేర్కొంటూ ఆ విధానం ర‌ద్దుచేయాలంటాడు. దీంతో య‌జీద్ హుసేన్ పై క‌క్ష పెంచుకుని అత‌న్ని ప్ర‌స్తుత ఇరాక్ ప్రాంతంలోని క‌ర్బ‌లా మైదానానికి ర‌ప్పిస్తాడు. ఇక త‌న బంధుమిత్రులు, అనుచ‌రులు 72 మందితో క‌లిసి అక్క‌డికీ చేరుకున్న హుసేన్‌ను య‌జీద్ సైనికులు మైదానంలోనే నిర్బందిస్తారు. వారికి క‌నీసం మంచినీరు కూడా ల‌భించ‌కుండా క‌ట్ట‌డి చేస్తారు. ఈ త‌రుణంలోనే 10 రోజుల పాటు జ‌రిగిన యుద్ధంలో చివ‌రి రోజు హుసెన్‌, అత‌ని కుటుంబ స‌భ్యులు, అనుచ‌రులు వీర‌మ‌ర‌ణం పొందుతారు.

Advertisement

 


మొహ‌ర్రం పండుగ సంద‌ర్భంగా గ్రామాల్లో, ప‌ట్ట‌ణాల్లో అషుర్ ఖానాల్లో పీర్లను ప్ర‌తిష్టిస్తారు. అషుర్ ఖానాలు లేని చోట్ల తాత్కాలికంగా పందిళ్లు వేసి పీర్ల‌ను నిలుపుతారు. పీర్ల‌కు ద‌ట్టీలు క‌ట్టి, కుడుక‌లు, గాజు, పువ్వుతో సంప్ర‌దాయబ‌ద్ధంగా అలంక‌రిస్తారు. 10 రోజుల పాటు ముస్లింల‌తో పాటు హిందువులు సైతం భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో ప్రార్థ‌న‌లు నిర్వ‌హిస్తారు. పీర్ల‌ను ప్రతిష్టించిన అషుర్ ఖానా ముందు గుండ్రంగా అలావా నిర్మించి, అందులో అగ్ని గుండాలు ఏర్పాటు చేసి చుట్టూరా తిరుగుతూ పాట‌లు పాడుతూ అసైదులా ఆట‌లు ఆడుతారు. సంతాప దినాలు ముగిసిన అనంత‌రం పీర్ల‌ను గ్రామంలోని ప్ర‌ధాన వీధుల్లో మేళ‌తాళాల మ‌ధ్య ఊరేగించి చెరువుల్లో నిమ‌జ్జ‌నం చేస్తారు. చాలా గ్రామాల్లో పీర్ల ఊరేగింపు వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తుంటారు. ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా కుల‌, మ‌తాల‌కు అతీతంగా ముస్లింలు, హిందువులు క‌లిసి జ‌రుపుకునే పండుగ మొహ‌ర్రం మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌గా నిలుస్తోంది.

Advertisement


ఇస్లాం మ‌తం కోసం ప్రాణ‌త్యాగం చేసిన ఇమామె హుసేన్‌కు పుణ్యం క‌ల‌గాలంటూ ముస్లింలు మొహ‌ర్రం మాసంలో 9, 10వ రోజు ఉప‌వాస దీక్ష‌లు చేప‌డుతారు. ఈ నెల‌ను శోక‌మాసంగా భావించ‌డం వ‌ల్ల చాలా మంది ముస్లింలు ఎలాంటి శుభ‌కార్యాలు త‌ల‌పెట్ట‌రు. నూత‌న దుస్తులు, వ‌స్తువులు వంటివి కొనుగ‌లు చేయ‌రు. ఇక క‌ర్బ‌లా మైదానంలో 10 రోజుల పాటు క‌నీసం మంచినీరు లేకుండా ద‌ప్పిక‌తో అల్లాడిన ప‌రిస్థితి ఎవ‌రికీ రాకూడ‌ద‌నేద ముస్లింల ఉద్దేశం. దీనిని దృష్టిలో ఉంచుకుని మొహ‌ర్రం పండుగ రోజు నీళ్లు లేదా పాల‌లో బెల్లం, సోంపు క‌లిపి ష‌ర్బ‌త్ త‌యారు చేసి అంద‌రికీ పంచుతారు. అదేవిధంగా ఆక‌లితో ఎవ్వ‌రూ మృతి చెంద‌డ‌కూద‌ని గోదుమ‌పిండి చ‌క్క‌ర‌, ఎండు ఫ‌లాల‌తో రొట్టే త‌యారు చేసి పంచుతారు. కొన్ని ప్రాంతాల్లో పెరుగు అన్నం త‌యారు చేసి దానం చేస్తారు.


మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తులు మ‌న దేశాన్ని ప‌రిపాలించే స‌మ‌యంలో తైమూర్ రాజు కాలంలో ఆయ‌న సైనికులు ప్ర‌తి ఏడాది మొహ‌ర్రం కోసం ఇరాక్ వెళ్లేవార‌ట‌. అది గ‌మ‌నించిన ఆయ‌న వ్య‌య ప్ర‌యాస‌ల‌ను తొల‌గించేందుకు ఇక్క‌డే పీర్ల‌ను ప్ర‌తిష్టించ‌డం ప్రారంభించారు. ఇక అప్ప‌టి నుంచి అది క్ర‌మ క్ర‌మంగా మ‌న‌దేశంలో ఆచారంగా మారిపోయింది. దేశంలోని వివిధ రాష్ట్రాల‌తో పాటు ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో మొహ‌ర్రం వేడుక‌లు అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకుంటారు. ఇక హైద‌రాబాద్‌లో అయితే మొహ‌ర్రం సంద‌ర్భంగా షియా తెగ‌కు చెందిన ముస్లింలు సంతాప సూచ‌కంగా ర‌క్తం చిందిస్తుంటారు.

Also Read : 

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరుగుతాయి జాగ్ర‌త్త‌

ఈ రాశుల వారిని పెళ్లి చేసుకున్న మ‌హిళ‌లు అదృష్ట‌వంతుల‌ట‌.. ఏ రాశుల వారంటే..?

 

Visitors Are Also Reading