Telugu News » Blog » ఈ రాశుల వారిని పెళ్లి చేసుకున్న మ‌హిళ‌లు అదృష్ట‌వంతుల‌ట‌.. ఏ రాశుల వారంటే..?

ఈ రాశుల వారిని పెళ్లి చేసుకున్న మ‌హిళ‌లు అదృష్ట‌వంతుల‌ట‌.. ఏ రాశుల వారంటే..?

by Anji
Ads

భార్య భ‌ర్త‌ల సంసారం సాఫీగా సాగాలంటే ఒక‌రినీ మ‌రొక‌రు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. త‌న మాటే నెగ్గాల‌నే ధోర‌ణిలో ఇరువురు కూడా ఎప్పుడు ఉండ‌రు. ప్ర‌పంచంలో చాలా వ‌ర‌కు పురుషాధిక్య‌త ఉంటుంది. గ‌తంతో పోల్చితే ఇందులో చాలా వ‌ర‌కు మార్పులు వ‌చ్చినా ఇంకా కొన్ని చోట్ల పురుషుడు చెప్పిందే వేదం.. దానిని భార్య పాటించాల‌నే ధోర‌ణి ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం.. కొన్ని రాశుల వారు త‌మ భార్య‌ల‌ను కంటికి రెప్ప‌లా చూసుకుంటార‌ట‌.  వారు ఏయే రాశుల వారో ఇప్పుడు మ‌న తెలుసుకుందాం.

Ads


వృష‌భ‌రాశి : 

ఈ రాశి వారు త‌మ భార్య‌ల‌కు ఎప్పుడూ గౌర‌వం ఇస్తూ ఉంటారు. వీరికి త‌మ భాగ‌స్వామి ఆనందం కంటే కూడా ఏది ఎక్కువ కాద‌ట‌. వీరిని సంతోషంగా ఉంచేందుకు ఈ రాశి వారు ఎప్పుడూ ముందుంటారు. అంతేకాదు.. వ్యక్తిగ‌త విష‌యాల్లో ఈ రాశి వారు త‌మ భాగ‌స్వామి ముందు ఎటువంటి వాటిని అస‌లు దాచ‌ర‌ట‌.

ధ‌న‌స్సు రాశి : 

Ads

ధ‌న‌స్సు రాశి వారు ఈ జాబితాలో ముందు ఉంటార‌ట‌. స్వ‌త‌హాగా ఈ రాశివారు స‌ర‌దాగా ఉండే స్వ‌భావం గ‌ల‌వారు. ఇక ఈ రాశి వారు త‌మ భార్య‌ల‌ను ఎప్పుడూ సంతోషంగా చూసుకుంటార‌ట‌. అదేవిధంగా వారి మ‌న‌స్సు తెలుసుకొని వారితో మెలుగుతార‌ట‌.

సింహ రాశి : 

 

సింహ‌రాశి వారు త‌మ పార్ట్‌న‌ర్ ని చాలా ప్రేమిస్తార‌ట‌. సింహ రాశి వారు స్వ‌త‌హాగా చాలా శ‌క్తివంతులు అయిన‌ప్ప‌టికీ త‌మ భార్య‌ల విష‌యంలో వీరు చాలా అనుకువ‌తో ఉంటార‌ట‌. వారి ఇష్టాయిస్టాల‌ను ఎల్ల‌ప్పుడూ గౌర‌విస్తార‌ట‌. వారికి న‌చ్చ‌ని వాటి ప్ర‌స్తావ‌న‌ను ఎప్పుడూ తీసుకురాకుండా జాగ్ర‌త్త ప‌డ‌తారు.

మీన రాశి : 

మీన రాశి వారు త‌మ భాగ‌స్వాముల‌తో ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ అవుతారని జ్యోతిష్య‌శాస్త్రం చెబుతుంది. ఒక రకంగా ట్రూ ల‌వ్‌కు నిద‌ర్శ‌నం మీన రాశి వారే అని చెప్ప‌వ‌చ్చు. త‌మ భాగస్వాముల‌ను వీరు ఎంతో గాఢంగా ప్రేమిస్తార‌ట‌. వారికి కొంచెం కూడా అసౌక‌ర్యం క‌లుగ‌కుండా చూసుకుంటార‌ట‌.

Also Read : 

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు ఎంత క‌ష్ట‌ప‌డితే అంత మంచిది

Ad

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆ విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి