Home » “మ‌న‌సంతా నువ్వే” సినిమా మ‌హేష్ బాబు వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా అడ్డుకుంది ఎవ‌రో తెలుసా..?

“మ‌న‌సంతా నువ్వే” సినిమా మ‌హేష్ బాబు వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా అడ్డుకుంది ఎవ‌రో తెలుసా..?

by AJAY
Published: Last Updated on
Ad

కొన్ని సినిమాలు ముందు ఒక హీరోతో అనుకుంటే ఆ త‌ర‌వాత మ‌రో హీరోతో చేయాల్సి వ‌స్తుంది. అలా టాలీవుడ్ లో చాలా సినిమాలు ఒక హీరోతో అనుకునుకుంటే మ‌రో హీరోతో చేశారు. అలాంటి సినిమాల లిస్ట్ లో ఉద‌య్ కిర‌ణ్ హీరోగా న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా మ‌న‌సంతా నువ్వే కూడా ఉంది. ఈ సినిమాకు విఎన్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అంతే కాకుడా ఈ చిత్రానికి ప్ర‌ముఖ నిర్మాత ఎమ్ ఎస్ రాజు నిర్మించారు. ఇక యంగ్ డైరెక్ట‌ర్ తో సినిమా చేయాలనే ఆలోచ‌న‌లో ఉన్న ఎమ్ ఎస్ రాజుకు ఓ కెమెరామెన్ విఎన్ ఆదిత్య గురించి చెప్పాడు.

manasanthanuvve

manasanthanuvve

దాంతో ఎమ్ ఎస్ రాజు విఎన్ ఆదిత్య‌కు ఫోన్ చేశాడు. కానీ ఆయ‌న రెస్పాన్స్ ఇవ్వ‌లేదు. మ‌రుస‌టి రోజు ఎమ్ ఎస్ రాజు మ‌రోసారి ఫోన్ చేశాడు. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయ‌గా ఓ సారి వ‌చ్చి క‌లుస్తావా అని అడిగాడు దాంతో విఎన్ ఆదిత్య సారీ సార్ నేను రాజ‌మండ్రి వెళుతున్నా గుడిలో పూజ చేయించుకోవ‌డానికి వెళుతున్నా అని అన్నారు. ఆ త‌ర‌వాత వారం రోజులు విఎన్ ఆదిత్య కోసం ఎదురుచూసినా ఆయ‌న మాత్రం రాలేదు. ఇక చివ‌ర‌గా మ‌రోసారి ఎంఎస్ రాజు ఫోన్ చేద్దామ‌నుకున్నారు.

Advertisement

Advertisement

విఎన్ ఆదిత్య‌ సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్ష‌న్స్ ఆఫీసుకు వ‌చ్చాడు. విఎన్ ఆదిత్య మాట్లాడుతూ నేను ల‌వ్ స్టోరీతోనే ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌వ్వాల‌నుకున్నాను అని చెప్పారు. స‌రే అని చెప్పిన ఎమ్ ఎస్ రాజు రెండు క‌థ‌ను విఎన్ ఆదిత్య‌కు వినిపించారు. హిందీలో వ‌చ్చిన అన్ముల్ గ‌డి అనే సినిమా క‌థ‌ను బేస్ చేసుకుని ఓ క‌థ‌ను డెవ‌ల‌ప్ చేశారు. ఇక ఈ సినిమాకు మ‌న‌సంతా నువ్వే అనే టైటిల్ ను కూడా ఎమ్ ఎస్ రాజు పెట్టారు.

సినిమాలో హీరోగా మ‌హేశ్ బాబును తీసుకోవాల‌ని ఎమ్ ఎస్ రాజు అనుకున్నారు. కానీ విఎన్ ఆదిత్య కొత్త కుర్రాడితో సినిమా చేయాల‌ని అనుకున్నారు. ఎమ్ ఎస్ రాజు కొత్త కుర్రాడు ఎక్క‌డ దొరుకుతాడు అని అడ‌గ్గా విఎన్ ఆదిత్య చిత్రం సినిమాతో ప‌రిచ‌య‌మైన ఉద‌య్ కిర‌ణ్ గురించి చెప్పాడు. దాంతో ఎమ్ ఎస్ రాజు చిత్రం సినిమా చూసి ఉద‌య్ కిర‌ణ్ ను ఫిక్స్ చేశాడు. క‌ట్ చేస్తే సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుద‌ల చేయ‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

ALSO READ :

దేవుళ్ళు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూశారా.?

Visitors Are Also Reading