Home » దేవుళ్ళు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూశారా.?

దేవుళ్ళు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూశారా.?

by AJAY
Ad

ఒక‌ప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా న‌టించిన వాళ్లు ప్ర‌స్తుతం హీరోలు, హీరోయిన్ లుగా ఎంట్రీ ఇస్తున్నారు. టాలీవుడ్ లో అలా ఎంద‌రో చైల్డ్ ఆర్టిస్ట్ లు రీఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ అయ్యారు. యంగ్ హీరో తేజ స‌జ్జా ప్ర‌స్తుతం హీరోగా వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. కాగా గ‌తంలో ఎన్నో సినిమాల్లోతేజ స‌జ్జ చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో స్థానం సంపాదించుకున్న మ‌రో చైల్డ్ ఆర్టిస్ట్ నిత్యా శెట్టి ఈ పేరు చెబితే ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌క‌పోవ‌చ్చు గానీ దేవుళ్లు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ అంటే గుర్తు ప‌ట్ట‌ని వారంటూ ఉండ‌రు.

 

Advertisement

నేహా శెట్టి దేవుళ్లు సినిమాలో త‌న న‌ట‌న‌కు గా ఏకంగా నంది అవార్డును అందుకుంది. అదేవిధంగా రెండు నేష‌న‌ల్ అవార్డుల‌ను నిత్యాశెట్టి సొంతం చేసుకుంది. చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్స్ తోనూ నిత్యాశెట్టి ఎంతో మందిని ఆక‌ట్టుకుంది. ఇక తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న‌ప్ప‌టికీ నిత్యాశెట్టి తెలుగమ్మాయి కాదు త‌మిళ అమ్మాయి.

Advertisement

కానీ తెలుగులోనూ సినిమాలు చేసి మెప్పించ‌డం విశేషం. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిన త‌ర‌వ‌త నిత్యాశెట్టి సినిమాల‌కు దూర‌మ‌య్యింది. త‌న చ‌దువుల పై దృష్టి పెట్టింది. చ‌దువులు పూర్త‌యిన త‌ర‌వాత సాఫ్ట్ ఇంజ‌నీర్ గా ఉద్యోగం సంపాదించుకుంది. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మ‌రోవైపు మాడ‌లింగ్ కూడా చేసింది. ఇక 2015లో నిత్యా శెట్టి రాజేంద్ర‌ప్ర‌సాద్ ముఖ్య‌పాత్ర‌లో న‌టించిన దాగుడుమూత‌ల దండాకోర్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

అదే ఏడాది త‌మిళ్ లో మ‌రో సినిమా కూడా చేసింది. అదే విధంగా ప‌డేశావే అనే సినిమాలో కూడా న‌టించి ఆక‌ట్టుకుంది. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా నిత్యాశెట్టికి వ‌చ్చిన సూప‌ర్ హిట్స్ మాత్రం హీరోయిన్ గా రాలేదు.

దాంతో ఇప్పటికీ హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ప్రస్తుతం నిత్యాశెట్టి నిహారిక నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ఈ సినిమా ఆమెకు ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి.

Also read :

సమంత నాగచైతన్య బాటలో మరో స్టార్ కపుల్…..ఎవరంటే..?

Visitors Are Also Reading