Home » హైదరాబాదులో పెద్ద బంగ్లా కొన్న మృనాల్ ఠాకూర్!

హైదరాబాదులో పెద్ద బంగ్లా కొన్న మృనాల్ ఠాకూర్!

by Bunty

హీరోయిన్ మృనాల్ ఠాకూర్ గురించి తెలియని వారుండరు. తన అందచందాలతో ఇప్పుడు తెలుగులో కూడా దుమ్ము లేపుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేసిన సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హను రాగవపూడి దర్శకత్వం వహించగా, దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది.

ఇక సీతారామం సినిమాతో హీరోయిన్ మృనాల్ తెలుగు వారికి పరిచయమైంది. నెమలి కండ్లతో లక్షణంగా కనిపిస్తూ మృనాల్ తన మాయలో పడేసుకుంది. ఇక ఓవర్ నైట్ ఈ భామకు సోషల్ మీడియాలో కూడా క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా ఈ బ్యూటీ హైదరాబాదులో ఒక ఇల్లు కోన్నట్లు సమాచారం అందుతోంది. కోట్లు పెట్టి ఈ ఇల్లుకోన్నట్లు సమాచారం. అయితే హైదరాబాద్ సిటీ అవుట్ కట్స్ లో ఈ ఇల్లుకోన్నట్టు ప్రాథమిక సమాచారం.

గతంలోనూ తనకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టమని పేర్కొంది ఈ బ్యూటీ. ఈ తరుణంలోనే ఆమె ఇల్లు కొన్నట్లు తాజాగా వార్తలు వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా, మృణాల్ సీతారామం సినిమాలో చాలా పద్ధతిగా కనిపించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం బీచ్ లలో, బికినీలతో ఫోటోలు షేర్ చేస్తోంది. దాంతో సీతారామంలో ఎంతో పద్ధతిగా కనిపించావు ఇప్పుడు ఇలాంటి బట్టలు వేసుకుంటావా అంటూ నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. కానీ వాటిని ఏమాత్రం ఈ బ్యూటీ పట్టించుకోవడం లేదు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Anchor Varshini : యాంకర్ వర్షిణితో SRH ప్లేయర్ రొమాన్స్ ?

RBI : రూ.2000 నోటు రద్దు.. ఎలా మార్చుకోవాలో తెలుసా ?

Devara : దండయాత్ర చేసేందుకు వచ్చాడు రా “దేవర”

Visitors Are Also Reading