Home » Devara : దండయాత్ర చేసేందుకు వచ్చాడు రా “దేవర”

Devara : దండయాత్ర చేసేందుకు వచ్చాడు రా “దేవర”

by Bunty
Ad

టాలీవుడ్ టాప్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి వారసత్వం నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్… అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పడి చచ్చిపోతారు. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్. అయితే RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్.

Advertisement

ఇక ఇప్పుడు…యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా… కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం ‘NTR30’. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యూవ సుధా ఆర్ట్స్ బ్యానర్స్ పై కోసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ కథానాయిక.

Advertisement

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో ప్రతి నాయకుడు అని తెలుస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఎన్టీఆర్ చిత్రానికి తొలిసారి సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్రం బృందం. దేవరా అనే టైటిల్ ను ఈ సినిమాకు… ఫిక్స్ చేసింది చిత్ర బృందం. ఈ మేరకు ఎన్టీఆర్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది. ఇక ఈ పోస్టర్ను చూసిన నందమూరి ఫ్యాన్స్ పూనకాలు తెచ్చుకుంటున్నారు. మా జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసారా అంటూ ఈ పోస్టర్ పై కామెంట్లు పెడుతున్నారు.

 

 

Visitors Are Also Reading