Mrugaraju : చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఏ సినిమా నటించిన హిట్ అవుతుంది. చిరంజీవి నటించిన సినిమాలకు హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. అయితే చిరు కెరియర్ లో బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం చెందిన సినిమాలలో మృగరాజు మూవీ ఒకటి.
Advertisement
ఈ మూవీకి గుణశేఖర్ దర్శకత్వం వహించగా, సిమ్రాన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ 2001వ సంవత్సరం జనవరి 11వ తేదీన విడుదల అయింది. ఈ మూవీకి విడుదలైన మొదటి రోజు మొదటి షోకే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించింది. దీంతో చిరు అభిమానులు కూడా అప్పటితో నిరాశను వ్యక్తం చేశారు. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమా ఆ రోజుల్లో అనేక సెంటర్లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్లను కూడా నమోదు చేసింది.
Advertisement
అలాగే ఈ మూవీ మొత్తం బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది. కృష్ణాజిల్లాలో ఈ మూవీ ఆ సమయంలో 39 లక్షల షేర్ కలెక్షన్ ను రెండు వారాల్లో రాబట్టింది. ఇది ఆ టైములో ఆల్ టైం రికార్డ్ కావడం విశేషం. ఈస్ట్ గోదావరి 40 లక్షలు, వెస్ట్ గోదావరి 30 లక్షల కలెక్షన్లను వసూలు చేసింది. మొత్తంగా 14 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. దీంతో నిర్మాతలకు లాభాలు వచ్చాయి.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
భీమ్లా నాయక్ సినిమాకు జగన్ వల్ల రూ. 30 కోట్లు నష్టం వచ్చిందా ?
Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్!
చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?