Home » తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఇవే..!

తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఇవే..!

by Anji
Ad

నందమూరి తారక రామారావు మనవడు, నందమూరి మోహన  కృష్ణ కుమారుడు తారకరత్న ఫిబ్రవరి 22, 1983లో జన్మించారు. ఈయన 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. అదే ఏడాది యువరత్న అనే సినిమాలో కూడా నటించారు. 2003లో తారక్ అనే సినిమాలో నటించారు. మరోవైపు ఒకే రోజు 9 సినిమాలకు పూజా కార్యక్రమాలు చేసిన ఏకైక హీరోగా తారకరత్న చరిత్రలో నిలిచాడు. 

Advertisement

తారకరత్నకు అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. 15 కి పైగా చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు దక్కలేదు. అడపాదడపా చిత్రాలు చేస్తున్నప్పటికీ కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటించారు తారకరత్న. అమరావతి చిత్రానికి తారకరత్న విలన్ గా నటించడంతో ఆ చిత్రానికి నంది అవార్డు వరించింది. అదేవిధంగా నారా రోహిత్ నటించిన రాజా చేయి వేస్తే సినిమాలో కూడా తారకరత్న విలన్ గా నటించాడు. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఎస్ 5 సినిమాలో కూడా నెగిటివ్ రోల్ లో కనిపించి అందరినీ మెప్పించాడు. 

Advertisement

Manam News

2012లో తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు. తారకరత్న భార్య పేరు అలేఖ్యరెడ్డి. తారకరత్న హీరోగా నటించిన నందీశ్వరుడు చిత్రానికి అలేఖ్య కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు. ఇటీవల రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ.. తాను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోతున్నట్టు ప్రకటించాడు తారకరత్న. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రలో పాల్గొని అకస్మాత్తుగా కిందపడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుప్రతికి తరలించగా అతనికి గుండెపోటు, మెలెనా వ్యాధి అని వెల్లడి అయింది.  

Also Read :  తారకరత్న హెల్త్ కండీషన్ గురించి మీడియాకు ఎన్టీఆర్ ఏం చెప్పారంటే..?

  

Visitors Are Also Reading