Home » తారకరత్న హెల్త్ కండీషన్ గురించి మీడియాకు ఎన్టీఆర్ ఏం చెప్పారంటే..?

తారకరత్న హెల్త్ కండీషన్ గురించి మీడియాకు ఎన్టీఆర్ ఏం చెప్పారంటే..?

by Anji
Ad

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవ్వగలం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స కోసం బెంగళూరులోనే నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక విమానంలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా తీశారు ఎన్టీఆర్. ఆస్పత్రికి చేరుకున్నారు.

Advertisement

ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.  “జనవరి 27వ తేదీన మా కుటుంబంలో ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. మా అన్న తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతుంది. తాత సీనియర్ ఎన్టీఆర్ తో పాటు ఎంతో మంది అభిమానుల ఆశీర్వాదం ఆయనకు ఉంది. ఈ పరిస్థితుల నుంచి ఆయన త్వరగా కోలుకొని మునుపటి మాదిరిగా మన అందరితో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం తారకరత్న పోరాడుతున్నారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందుతుంది. తారకరత్న క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడ్డారని మనం చెప్పలేము. కానీ ఆయన త్వరలోనే కోలుకుంటారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.  ఈ పరిస్థితుల్లో సాయం అందిస్తున్న కర్ణాటక హెల్త్ మినిస్టర్ సుధాకర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరొక ఇద్దరు డాక్టర్లను కూడా రప్పించడం జరుగుతుందని చెప్పాడు. ఎక్మోలో ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదని తనకు వైద్యులు ఇచ్చిన ధైర్యాన్ని అభిమానులకు తెలియజేస్తున్నాను” ఎన్టీఆర్ చెప్పాడు. ఇదే సమయంలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. తమ్ముడు తారకరత్న త్వరగా కోలుకోవాలని అందరూ ఆ దేవుని ప్రార్థించాలని కోరుకుంటున్నాను తెలిపాడు.  మరోవైపు గుండెపోటుతో పాటు మెలెనా వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు వెల్లడించారు.

Advertisement

Also Read :  పఠాన్ లుక్ లో డేవిడ్ వార్నర్.. అభిమానులు ఏమంటున్నారంటే..?

మెలెనా అనేది జీర్ణశయాంతక రక్తస్రావానికి సంబంధించిన ఓ అరుదైన వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారికి మలం చాలా జిగటగా, నల్లగా వస్తుంది. అదేవిధంగా మెలేనా వల్ల అన్నవాహిక, నోరు, పొట్ట, చిన్నపేగు మొదటి భాగం రక్తస్రావానికి గురవుతుంది. కొంత మందికి  ఎక్కువగా జీర్ణశయాంతర దిగువ భాగంలో ఉండే పెద్ద పేగు యొక్క ఆరోహణ భాగంలో కూడా రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. దీనికి మెరుగైన చికిత్స ఎలా చేస్తారంటే..  పెప్టిక్ అల్సర్స్ ట్రీట్మెంట్, ఎండోస్కోపీ థెరపీ వంటి చికిత్సలను చేస్తారని స్పెషలిస్టులు చెబుతున్నారు. అదేవిధంగా యాంజియోగ్రాఫిక్ ఎంబలైజేషన్, సర్జికల్ థెరపీలతో పాటు రక్తాన్ని మార్పిడి చేయడం వంటి చికిత్సలు కూడా ఈ వ్యాధి బారిన పడిన వారికి అందించనున్నట్టు సమాచారం.  

Also Read :   సీరియస్ వార్నింగ్.. రజినికాంత్ పేరు వాడితే ఖబడ్దార్..!

Visitors Are Also Reading