వెండితెర ఎందరికో కలల ప్రపంచం అవుతుంది. తమ కలలు సాకారం చేసుకునే ప్రపంచం సినిమా ప్రపంచమే. ఈ సినీ ప్రపంచం మాత్రం డబ్బుతో ముడిపడింది. అవకాశాలతో స్టార్స్‌గా ఎదిగినా.. చివరికీ చిల్లిగవ్వ లేకుండా ఉన్న జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఎందరో ఎదురు చూసి.. తీరా ఆ ఛాన్స్ వచ్చిన తరువాత ఆకాశానికెగిరి ఆ తరువాత ఎన్నో కష్టాలు పడి ఒకేసారి అదఃపాతాళానికి పడిపోయిన వారు ఉన్నారు. వారిలో కొందరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
గీతాంజలి నాగ్ పాల్ :
Advertisement
వెండితెర విషాద జీవితాల గురించి మాట్లాడుకుంటే మొదట మాట్లాడుకోవాల్సింది గీతాంజలి నాగ్ పాల్ గురించే.. సుస్మిత సేన్ వంటి వారితో ర్యాంప్‌పై నడిచిన గీతాంజలి నాగ్‌పాల్ తరువాత బిచ్చగత్తెగా మారిపోయింది. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాల గ్యాడ్యుయేట్ అయిన గీతాంజలి. కెరీర్‌లో ఫెయిల్ అవ్వడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా డ్రగ్స్‌కు అలవాటు పడి చివరికీ ఢిల్లీ రోడ్ల మీద అడక్కుంటూ గడిపింది. ఆమె డిప్రెషన్ ఆత్మహత్య చేసుకునేంతగా తయారైంది. ఫ్యాషన్ సినిమాలో కంగనా రనౌత్ పోషించిన పాత్ర గీతాంజలి నాగ్‌పాల్ నిజజీవిత చరిత్రనే.
మిథాలి శర్మ:
భోజ్‌పురి నటి, మోడల్‌గా రాణించింది మిథాలి శర్మ. చివరికీ అవకాశాలు లభించక పలు దొంగతనాలకు పాల్పడింది. కారు అద్దాలు ధ్వంసం చేసి దొంగతనం చేస్తుండగా పోలీసులకు పట్టుబడింది. అప్పుడు ఆమె పోలీసులను అడిగిన ఒకే కోరిక భోజనం పెట్టాలని.. అప్పటికే ఆమె భోజనం చేసి రెండు రోజులు అయిందట. వింటుంటునే ఇంత వింతగా ఉంది. ఆమె పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
పర్వీన్ బాబి :
Advertisement
1980 దశాబ్దంలో ఒక ఊపు ఊపిన తార పర్విన్ బాబి. అమితాబ్ బచ్చన్, శశికపూర్, శత్రుజ్ఞ సిన్హా వంటి అగ్రనటులందరితో కలిసి నటించింది పర్విన్. టైమ్ మ్యాగజైన్ ముఖచిత్రంగా ఫ్రింట్ అయిన తొలి నటి పర్వీన్‌బాబి. స్క్రిజోపెనియాతో బాధపడిన బాబీ తరువాత అవకాశాలు లేక వైద్యం చేయించుకోవడానికే డబ్బులు లేకుండా.. చివరికీ దిక్కు మొక్కులేని అనాథలా ముంబైలోని తన ప్లాట్‌లో మరణించింది. మృతి చెందిన రెండు రోజుల వరకు ఎవ్వరూ కూడా గుర్తించలేదు.
సీతారాం పాంచల్ :
పీప్లి లైవ్, పాన్‌సింగ్ తోమర్ వంటి సినిమాలలో తాను పోషించిన పాత్రల ద్వారా అందరికీ గుర్తుండిపోయిన నటుడు సీతారాం పాంచల్. ఆరోగ్యం క్షీణించి ఆర్థిక పరిస్థితులు సహకరించక చివరికీ సాయం చేయండంటూ ఫేస్‌బుక్ ద్వారా తన అభిమానులను వేడుకున్నాడు.
సవీ సిద్దూ :
పాటియాలా హౌజ్, బేవకుపియా వంటి సినిమాల్లో నటించిన నటుడు సవీ సిద్దూ.. అనారోగ్యం కారణంగా పాటియాలా దూరమయ్యారు. ఇప్పుడు పూట గడవడానికి ముంబైలో సెక్యురిటీ గార్డుగా పని చేస్తూ ఉన్నారు.
సులక్షణ పండిట్:
నటుడు సంజీవ్ కపూర్ ను ప్రేమించిన సులక్షణ పండిట్ ఒకప్పుడు ఫేమస్ సింగర్. కానీ తరువాత ఆర్థికంగా చితికిపోయిన ఆమె ఒకసారి ముంబైలోని ఒక గుడి మెట్లపై అడుక్కుంటూ కనిపించింది. తరువాత సులక్షణ మరిది ఆదిత్య శ్రీవాత్సవ ఆమె బాగోగులు తాను చూసుకుంటానంటూ వారింటికి తీసుకెళ్లారు. సులక్షణది వన్ సైడ్ లవ్ కావడం గమనార్హం.
జగదీశ్ మాలి :
నటి ఆంత్రమాలి తండ్రి ఫేమస్ ఫొటో గ్రాఫర్ జగదీశ్ మాలి. 1970-90 వరకు ఎందరో టాప్ హీరో, హీరోయిన్ల ఫొటోలు తీసిన ఫొటో గ్రాఫర్. తరువాత అనారోగ్యంతో ముంబై రోడ్లమీద గడిపారు. చివరికీ చనిపోయినప్పుడు సల్మాన్‌ఖాన్ సాయం చేస్తే కొంత మంది మాలి అంత్యక్రియలు నిర్వహించారు.