Home » ఫేక్ కాల్స్ ని తట్టుకోలేక.. మౌనిక షాకింగ్ నిర్ణయం.. ఆఖరికి..?

ఫేక్ కాల్స్ ని తట్టుకోలేక.. మౌనిక షాకింగ్ నిర్ణయం.. ఆఖరికి..?

by Sravya
Ad

ఈ రోజుల్లో మోసాలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా, మొబైల్ ఫోన్ల ద్వారా విపరీతమైన మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఫేక్ రాయుళ్ల వేధింపులని తట్టుకోలేక, ఒక బీటెక్ విద్యార్థిని ఆత్మ$త్య కి పాల్పడింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం… కొత్తగూడానికి చెందిన మౌనిక (22 ) కోదాడలోని ఒక ప్రముఖ కాలేజీలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. కొంతమంది ఫేక్ రాయుళ్లు ఈమెకి ఫోన్ చేస్తూ ఉండేవారు. ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చిందని, దానికి ముందు 28 వేల రూపాయలని చెల్లించాలని చెప్పారు. నిజమే అనుకుని మౌనిక తన వద్ద డబ్బులు లేకున్నా స్నేహితుల వద్ద అడిగి డబ్బులు చెల్లించింది.

Advertisement

Advertisement

మళ్లీ వాళ్లు ఫోన్ చేసి మిగిలిన డబ్బులు చెల్లించాలని అనేక రకాలుగా టా$ర్చ$ర్ చేయడం మొదలుపెట్టారు. మౌనికకి అనుమానం వచ్చి స్నేహితులతో పాటు కాలేజ్ యాజమాన్యానికి జరిగింది చెప్పింది. ఇవి ఫేక్ కాల్స్ అని యువతని మందలించారు. తర్వాత ఆమె తల్లిదండ్రులకి కూడా వివరించడంతో మౌనికకి సర్ది చెప్పారు. ఆమె మాత్రం టార్చర్ ని తట్టుకోలేకపోయింది. పరువు పోతుంది అనుకుందో ఏమో కానీ ఆమె పురుగులు మందు తాగేసి సూసై$ చేసుకుంది. ఇది తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Visitors Are Also Reading