Home » జయసుధ కాఫీలో మోషన్ టాబ్లెట్స్..వారి అరాచ‌కాల‌ను బ‌య‌ట‌పెట్టిన న‌టుడు

జయసుధ కాఫీలో మోషన్ టాబ్లెట్స్..వారి అరాచ‌కాల‌ను బ‌య‌ట‌పెట్టిన న‌టుడు

by Anji
Ad

తెలుగు డైలీ సిరియ‌ల్స్‌లో తొలి హీరో అత‌ను. రెండ‌వ డైలీ సీరియ‌ల్లో కూడా అత‌నే హీరో. రుతురాగాలు, అమ్మ‌మ్మ‌.కామ్ వంటి పాపుల‌ర్ సీరియ‌ల్స్‌లో ఈయ‌న అద్భుత న‌ట‌న ప్రేక్ష‌కుల‌కు గుర్తుండే ఉంటుంది. దాదాపు వంద‌కు పైగా సీరియ‌ల్స్ లో న‌టించారు. బాహుబ‌లి సెరా వంటి పెద్ద పెద్ద సినిమాల్లోనూ న‌టించారు. బాముబ‌లి సినిమాల్లో త‌మ‌న్నాకు అన్న‌గా న‌టించింది. ఈయ‌నే. దాదాపు 30 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉండి వందలాది సినిమాలు, సీరియ‌ల్స్‌లో న‌టించిన మేకా రామ‌కృష్ణ అంటే అటు బుల్లితెర, ఇటు వెండి తెర ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. చాలా మందికి తెలియ‌దు. కానీ మ‌నిషిని చూస్తే హో ఈయ‌నా అని వెంట‌నే గుర్తు ప‌డుతుంటారు.

Advertisement

సీనియారిటీకి ఉన్న‌ప్ప‌టికీ ఈయ‌న‌కు నేటికి స‌రైన గుర్తింపు ల‌భించ‌లేద‌నే చెప్పాలి. గుర్తింపు సంగ‌తి అటుపెడితే.. ఈయ‌న‌కు ఈయ‌న లాంటి మ‌రెంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ల‌కు జ‌రిగే ఘోర అవ‌మానాల గురించి తెలిస్తే.. క‌ళ్లు చెమ‌ర్చ‌క మాన‌వు. చిన్న‌, పెద్ద అని తేడా చూపిస్తూ.. ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లో జ‌రిగే అవ‌మానాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. మేకా రామ‌కృష్ణ వాస్త‌వానికి ఇలాంటి విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి ఏ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సాహ‌సం చేయ‌రు. ఎందుకంటే.. ఎక్క‌డ క్యారెక్ట‌ర్ ఇవ్వ‌రు అనే భ‌యంతో కానీ.. ఇన్నాళ్లు ఎన్నో అవ‌మానాల‌ను భ‌రించిన మేకా రామ‌కృష్ణ ప్రొడక్ష‌న్ హౌస్‌ల‌లో జ‌రిగే అరాచ‌కాల‌ను బ‌య‌ట‌ప‌ట్టారు.

 

Also Read :  లాక్ డౌన్ లో బ్రహ్మానందం గారు గీసిన ఈ చిత్రాలు ఒకొక్కటి ఒక అద్భుతం ..!

ఇండ‌స్ట్రీలో మ‌మ్మ‌ల్ని బాధ‌పెట్టిన సంఘ‌ట‌న‌లు చాలా ఉన్నాయి. జీవిత‌మే వేస్ట్ అని క‌ళ్ల నీళ్లు పెట్టుకున్న సంద‌ర్భాలున్నాయి. పెద్ద‌వాళ్ల‌ని ఒక‌లా, చిన్న ఆర్టిస్ట్‌ల‌ను ఒక విధంగా ట్రీట్ చేస్తుంటారు. త‌ప్ప‌లేదు కొన్ని ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లు అయితే చిన్న ఆర్టిస్ట్‌ల‌ను మ‌నుషులా ట్రీట్ చేయ‌రు. చిన్న ఆర్టిస్ట్‌లు అంటే ప్రొడ‌క్ష‌న్ బాయ్స్ ఘోరంగా ట్రీట్ చేస్తారు. చాలా సిగ్గు అనిపిస్తుంది. న‌ర‌కంలా అనిపిస్తుంది. వాళ్లు ట్రీట్ చేసే విధానం చూస్తే.. హే పో అని మ‌న‌పై విసుక్కుంటారు.

Advertisement

ప్రొడ్యుసర్ అన్నీ సమకూర్చి పెడతాడు. ఈ ప్రొడక్షన్ వాళ్లు ఉన్న దాన్ని సర్వ్ చేయడానికి నరకం చూపిస్తారు. అడుక్కునేవాడికి కూడా చాలా మర్యాదగా వేస్తారు.. కానీ ఈ ప్రొడక్షన్స్ బాయ్స్ చాలా నీఛంగా ప్రవర్తిస్తారు. ఎంత కోపం వస్తుందంటే.. నరికిపారేయాలనిపిస్తుంది. రియాక్ట్ అయిన సందర్బాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకొచ్చిన గొడవ ఎందుకులే అని నా ఫుడ్ నేనే తీసుకుని వెళ్తా. ఇంట్లో వాళ్లు పెట్టి పంపిస్తారు.


చాలామంది ప్రొడ్యుసర్స్ ఎలా చేస్తున్నారంటే.. ఫుడ్ పెట్టేదగ్గర కూడా నాలుగైదు కేటగిరీలు పెట్టేస్తున్నారు. మనం పొరపాటునైనా మనకి కేటాయించిన దాంట్లో కాకుండా పక్క దాంట్లోకి వెళ్లామంటే.. హీనంగా చూస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు.. సపోర్టింగ్ ఆర్టిస్ట్‌లకు సెపరేట్ టెంట్ వేసేస్తున్నారు. వాళ్లు అందులోనే ఉండాలి.. అందులోనే తినాలి. ఈ విష‌యాలు ప్రొడ్యూస‌ర్ల‌కు తెలియ‌దు. డైరెక్ట‌ర్ల‌కు తెలియ‌దు.  ప్రొడక్షన్ బాయ్స్ చాలా దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. వాళ్ల సొంత ఇంట్లో నుంచి తెచ్చిన సొమ్ములా ఫీల‌వుతారు. నేనే కాదు.. ఎంతో మంది క‌ళ్ల‌ల్లో నీళ్లు పెట్టుకున్న సంద‌ర్భాలున్నాయి. ప్రొడ‌క్ష‌న్ బాయ్స్‌ను పొర‌పాటున ఎవ‌రైనా తిడితే వాళ్ల‌కు ఇచ్చే కాఫీలో మోష‌న్ టాబ్లెట్ ఇస్తారు. ఆ కాఫీ తాగితే మోష‌న్స్ అవుతాయి. పెద్ద వాళ్ల‌కు కూడా అలా చేసారు. సీనియ‌ర్ న‌టి జ‌య‌సుధకు కూడా అలా చేశారు అని గుర్తు చేశారు.

ఓ స‌మ‌యంలో ఎనిమిది మందితో క‌లిసి భోజ‌నం చేయ‌డానికి కూర్చున్నాం. ఎనిమిది మందికి వేడిగా అక్క‌డే వండిన రైస్ వడ్డించారు. నాకు మాత్రం బ‌య‌ట నుంచి తెచ్చిన రైస్ పెప‌రేట్గా పెడుతున్నారు. అదేంట‌య్య నాకు కూడా పెట్ట‌వ‌చ్చు క‌దా అని అడిగితే.. మీకు అంతా రేంజ్ లేదు. అస‌లు మీరు ఇక్క‌డ ఎందుకు కూర్చున్నార‌ని పేర్కొన్నాడు. ఆ మాట‌తో నేను సిగ్గు ప‌డిపోయాను. క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగాయి. డైరెక్ట‌ర్లు, హీరో, హీరోయిన్లు అంద‌రూ ఉన్నారు. ఆరోజు చ‌చ్చిపోవాల‌నిపించింది. ఆ అవ‌మానాన్ని త‌ట్టుకోలేక‌పోయాను. పెద్ద ప్రొడ‌క్ష‌న్ హౌస్‌నే నిర్మాత‌ల‌కు ఏమి తెలియ‌దు. వాళ్లు తెచ్చిపెట్ట‌డం వ‌ర‌కే ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లో జ‌రిగే అరాచ‌కాలు పాపం వాళ్ల‌కు తెలియ‌దు. షూటిం్ చేస్తున్నారంటే హీరోయిన్ల‌కు త‌ప్పితే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ల‌కు క‌నీసం రూమ్ కూడా ఇవ్వ‌రు. ఇలాంటివి బ‌య‌ట‌పెడితే వీడు వద్ద‌ని తీసి ప‌క్క‌న పెడుతున్నారు. అని సంచ‌ల‌న విష‌యాల‌ను వెలుగులోకి తీసుకొచ్చారు మేన‌కా రామకృష్ణ‌.

 

Read Also :  బ్రహ్మానందం కామెడీ తో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలివే….!

Visitors Are Also Reading