Telugu News » Blog » బ్రహ్మీ కామెడీ వలన ప్లాపుల నుంచి హిట్ కొట్టిన సినిమాలు .! ఏవంటే ?

బ్రహ్మీ కామెడీ వలన ప్లాపుల నుంచి హిట్ కొట్టిన సినిమాలు .! ఏవంటే ?

by AJAY
Ads

లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. వందల చిత్రాల్లో కమెడియన్ గా నటించి బ్రహ్మానందం హాస్యబ్రహ్మ గా పేరు సంపాదించుకున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. మరోవైపు బ్రహ్మానందం కామెడీ వల్లే సూపర్ హిట్ అయ్యిన సినిమాలు కూడా టాలీవుడ్ లో ఎన్నో ఉన్నాయి. అలా బ్రహ్మానందం కామెడీ తో విజయం సాధించిన సినిమాలు ఇప్పుడు చూద్దాం.

Advertisement

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా జల్సా. అప్పటివరకు ఫ్లాపులతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కు ఈ సినిమాతో సూపర్ హిట్ దొరికింది. ఈ సినిమా విజయం లో బ్రహ్మానందం కామెడీ ముఖ్య భూమిక పోషించింది.

మంచు విష్ణు హీరోగా పరిచయమైన సినిమా ఢీ. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ హైలెట్ గా నిలిచింది.

శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా రెడీ. ఈ సినిమాకు కూడా బ్రహ్మానందం కామెడీ ఎంతో ప్లస్ అయింది.

Advertisement

Adhurs

Adhurs

ఎన్టీఆర్ హీరోగా నటించిన అదుర్స్ సినిమా థియేటర్ లలో నవ్వులు పూయించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రహ్మానందం కలిసి చేసే కామెడీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

Ready

Ready

మంచు విష్ణు ఖాతాలో మరో విజయం సాధించిన సినిమా దేనికైనా రెడీ. ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం కామెడీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న గోపీచంద్ లౌక్యం సినిమా తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ కడుపుబ్బా నవ్వించింది.

మహేష్ బాబు కెరీర్ లోని బ్లాక్ బస్టర్ చిత్రాల్లో దూకుడు కూడా ఒకటి. ఈ సినిమాలో బ్రాహ్మీ చేసే కామెడీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది.

Advertisement

Also read : parvathi melton : పార్వ‌తి మెల్ట‌న్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..ఏం చేస్తుందంటే..!