Telugu News » లాక్ డౌన్ లో బ్రహ్మానందం గారు గీసిన ఈ చిత్రాలు ఒకొక్కటి ఒక అద్భుతం ..!

లాక్ డౌన్ లో బ్రహ్మానందం గారు గీసిన ఈ చిత్రాలు ఒకొక్కటి ఒక అద్భుతం ..!

by Anji

హాస్య న‌టుడు బ్ర‌హ్మ‌నందం న‌టన గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌సర‌మే లేదు. కానీ ఆయ‌న చిత్ర లేఖ‌నం గురించి మాత్రం చాలా త‌క్కువ మందికే తెలుసు. లాక్‌డౌన్‌లో ఆయ‌న కాగితం, పెన్సిల్ ప‌ట్టుకుని గీసిన చిత్రాలు ఎంత‌గానో వైర‌ల్ అయ్యాయి. ఈ సాహితి ప్రియుడి క‌ళా నైపుణ్యానికి అభిమ‌మానులు మంత్ర ముగ్దులు అవుతున్నారు.

Ads


న‌ట‌న‌లోనే చిత్రాలు గీయ‌డంలో కూడా బ్ర‌హ్మ‌నందం దిట్టా అని నిరూపించుకున్నాడు. ఇటీవ‌ల అయోద్య‌లో రామ మంధిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సంద‌ర్భంలో బ్ర‌హ్మ‌నందం రాముని వీర భ‌క్తుడు అయిన‌టువంటి ఆంజ‌నేయుడి ఆనంద భాష్పాలు పేరుతో ఓ చిత్రం గీశారు. బ్ర‌హ్మీ గీసిన ఆ చిత్రం చాలా మందిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. క‌రోనా స‌మ‌యంలో బ్ర‌హ్మీ గీసిన‌ ఈ చిత్రాలు మ‌హా అద్భుత‌మ‌నే చెప్పాలి. అవి చూసిన ప‌లువురు నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందించారు.

No photo description available.

ముఖ్యంగా శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని త‌న కుంచెతో కాగితంపై సాక్షాత్క‌రించారు. దీనిని గీయ‌డానికి ఆయ‌న‌కు దాదాపు 45 రోజుల స‌మ‌యం ప‌ట్టింద‌ట‌.

Also Read: నిజాం న‌వాబు తాగిన ఈ సిగ‌రెట్ల గురించి మీకు తెలుసా?

No photo description available.

No photo description available.

No photo description available.

No photo description available.

క‌రుణా ర‌సం కురిపిస్తున్న‌ట్టుగా ఉన్న ఈ చిత్ర ప‌టాన్ని బ్ర‌హ్మానందం ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌కు బ‌హుమ‌తి ఇచ్చారు. స్వ‌హ‌స్తాల‌తో గీసిన ఈ డ్రాయింగ్స్ చూసి బ‌న్నీసంతోషం వ్య‌క్త ప‌రిచారు. ఈ బ‌హుమ‌తి వెల‌క‌ట్ట‌లేనిద‌ని ట్వీట్ చేసారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో బ్ర‌హ్మ‌నందం డ్రాయింగ్‌కు సంబంధించిన ఫొటోలు వైర‌ల‌వుతున్నాయి.

Also Read: భార్య‌, భ‌ర్త‌, విడాకులు, బ్యాగ్ నిండా చిల్ల‌ర‌! ఇంట్ర‌స్టింగ్ స్టోరి!!


You may also like