దోమలలో రెండు రకాలు ఉన్నాయి. ఇందులో ఆడ ఎనాఫిలస్ దోమల వలనే రోగాలు వస్తాయి. మగ ఎనాఫిలిస్ దోమల వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే మనం ఎక్కడైనా కొంతమందిలో కూర్చున్నప్పుడు దోమలు అనేవి అందులో అందరినీ కుట్టవు. కొంతమందిని మాత్రమే కుడతాయి. మరి ప్రత్యేకంగా వారిని ఎందుకు కుడతాయి. దానికి కారణం ఏమిటో తెలుసుకుందాం..!!
దోమలకు సూర్యుడు ఉన్నప్పుడు ఎక్కువగా కళ్ళు కనిపించవు. సూర్యుడు అస్తమించే సమయం లో చీకటి పడుతున్నప్పుడు అవి విజృంభిస్తాయి. ఆ సమయంలో వాటి కళ్ళు చాలా బాగా కనిపిస్తాయి. అలాగే దోమలు ఎక్కువగా డార్క్ కలర్ బట్టలు వేసుకున్న వారికి అట్రాక్ట్ అవుతాయట. బ్లాక్,రెడ్ కలర్ బట్టలు వేసుకున్న వారికి కూడా దోమలు ఎక్కువగా కుడతాయి. మరి ఎందుకు కుడతాయి.. మనం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ వదిలేస్తాం. కార్బన్ డయాక్సైడ్ అంటే దోమలకు చాలా ఇష్టం. దోమలు 160 అడుగుల దూరంలో ఉండి కార్బన్ డయాక్సైడ్ వాసనను గుర్తిస్తాయట. అలా వాసనతో మనుషుల వద్దకు వచ్చి కుడతాయి.
Advertisement
Advertisement
ఇందులో మరీ ముఖ్యంగా బాగా లావుగా ఉన్నవారు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ను బయటకు వదులుతారు. అందుకే దోమలు వారిని ఎక్కువ కుడతాయి.అలాగే మన శరీరం నుండి వచ్చేటటువంటి చెమటలో యూరిక్ యాసిడ్, అమ్మోనియా వంటి ఆమ్లాలు ఉంటాయి. ఇవి దోమలకు చాలా ఇష్టమట. ఎవరైనా బాగా పనిచేసి చెమటతో అలిసిపోయి వస్తే వారిని ఎక్కువగా కుడతాయి.అలాగే గర్భంతో ఉన్నటువంటి మహిళలు కూడా ఎక్కువ కార్బన్డయాక్సైడ్ విడుదల చేస్తారు. వీరిని కూడా దోమలు ఎక్కువగా కూడుతాయట. అందుకే ఆఫ్రికా లో ఉన్నటువంటి మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో మలేరియా ఎక్కువగా వస్తుందని పరిశోధనలో తేలింది.
ALSO READ:
మాస్క్ లేకపోతే తెలంగాణలో 1000 బాదుడే..!
బీర్ బాటిల్స్ గోధుమ, ఆకుపచ్చ రంగులోనే ఎందుకు ఉంటాయంటే..!