Telugu News » Blog » బీర్ బాటిల్స్ గోధుమ, ఆకుపచ్చ రంగులోనే ఎందుకు ఉంటాయంటే..!

బీర్ బాటిల్స్ గోధుమ, ఆకుపచ్చ రంగులోనే ఎందుకు ఉంటాయంటే..!

by Sravanthi Pandrala Pandrala
Ads

ప్రపంచంలో మత్తు పానీయాలలో ఎంతో ఇష్టంగా తీసుకునే పానీయం బీర్. పురాతన పానీయాలలో నీరు, టీ తర్వాత బీర్ మూడో స్థానంలో ఉంది. ప్రపంచం మొత్తం ప్రతి ఏడాది కొన్ని కోట్ల బీర్లు అమ్ముడవుతున్నాయి. అయితే బీర్ బాటిల్ ను గోధుమ లేదా ఆకుపచ్చ రంగు లోనే ఉండటం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ రెండు రంగులు కాకుండా వేరే రంగులో బీరు సీసా ఉండడాన్ని మీరు ఎప్పుడైనా చూసారా.. చూడలేదు.. ఈ రెండు రంగుల్లో మాత్రమే సీసాలు రావడానికి కారణం చాలా మందికి తెలియదు. బీరు తాగుతూ ఎంజాయ్ చేసేవారు బాటిల్ వెనకాల ఉన్న కారణాలను చూడరు. కానీ అది ఏంటో మనం తెలుసుకుందాం..

పూర్వకాలంలో మోనోపొటోమియా లోని సుమేరియన్ నాగరికత కాలం నుంచి మానవుడు బీర్ తాగుతున్నాడని చరిత్ర చెబుతోంది. వేల ఏండ్ల క్రితం పురాతన ఈజిప్టులో మొదటి బీర్ కంపెనీ ప్రారంభం అయిందని చెబుతారు. ఆ సమయంలో పారదర్శక సీసాల్లో బీర్ ప్యాకింగ్ జరిగేది. ఇలా ప్యాక్ చేయడం వల్ల బీర్ లోని యాసిడ్ సూర్యకిరణాల నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల ప్రభావానికి గురవుతుందని తేలింది. దీనివల్ల బీర్ దుర్వాసన రావడంతో జనాలు తాగడాన్ని తగ్గించారు.

అయితే సమస్య పరిష్కారానికి బీర్ తయారీదారులు ఒక ప్రణాళికను రూపొందించారు. బీర్ బాటిల్ లో ఎక్కువగా బ్రౌన్ కోటెడ్ బాటిల్ ని ఎంపిక చేశారు. ఈ విధానం చాలా పనిచేసింది. ఈ రంగు సీసాల్లో ఉంచిన బీరు చెడిపోలేదు. ఎందుకంటే సూర్యకిరణాలు గ్రౌండ్ బాటిల్ ల పై ప్రభావం చూపవు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో గోధుమరంగు సీసాలు కరువు వచ్చింది. ఆ సీసాలు అందుబాటులో లేకపోవడంతో బీరు తయారీ దారులు ఆకుపచ్చరంగు సీసాలను ఎంచుకోవాల్సి వచ్చింది. ఈ కలర్ సీసాలు కూడా అతినీలలోహిత కిరణాలకు ప్రభావితం కావు.

ALSO READ:

వంట చేసిన‌ప్పుడు మీ చెయ్యి కాలితే ఇలా అస్స‌లు చేయ‌కండి..!

మ్యాగీ తింటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి..!!

 

 


You may also like