Home » మస్కిటో కాయిల్ పొగ పీల్చి… ఆరుగురు మృతి… వీటిని వాడటం అంత ప్రమాదమా!

మస్కిటో కాయిల్ పొగ పీల్చి… ఆరుగురు మృతి… వీటిని వాడటం అంత ప్రమాదమా!

by Bunty
Ad

దోమలు చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దోమలను చంపే మస్కిటో కాయిల్స్ శరీరానికి ఇంకా ప్రమాదం అని చెబుతున్నారు. దీనికి ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగిన ఘటన కూడా మరింత ఆజ్యం పోసింది. దీని నుంచి వెలువడే విషపూరితమైన పొగ కారణంగా ఇంట్లో ఉన్నవారు నిద్రలోనే స్పృహ కోల్పోయి ఊపిరాడక మరణించారు. దీంతో ఈ దుర్ఘటనలో ఆరు మంది చనిపోయారు. కాయిల్స్ హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుంది.

READ ALSO : అక్కినేని మేనకోడలుతో కారులో అడ్డంగా దొరికిపోయిన అడవి శేష్!

Advertisement

ఇది శరీరానికి మంచిది కాదని వైద్య నిపుణులు కూడా ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి మస్కిటో కాయిల్ సిగరెట్ 75 కంటే ఎక్కువ ప్రాణాంతకం. ఇది మీకు, మీ కుటుంబానికి ప్రమాదకరం. ఒక నివేదిక ప్రకారం దోమలను చంపే ఈ కాయిల్స్ పొగ శ్వాస నాలంలో తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. శ్వాసకోసానికి ఆటంకం కలిగిస్తుంది. ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. దోమలు ఉపయోగించే మస్కిటో కాయిల్స్ అస్తమా వంటి సమస్యలను కలిగిస్తుంది.

Advertisement

READ ALSO : IPL 2023 : కెప్టెన్సీ మీట్ కు రోహిత్ దూరం… ఐపీఎల్ కు దూరం కానున్నాడా ?

Mosquito Repellents: 21 Products That Are Safe to Use

మనం కాయిల్ పొగను ఎంత ఎక్కువగా పీల్చుకుంటే అస్తమా వచ్చే ప్రమాదం అంత ఎక్కువ. ఈ పొగ శిశువు శ్వాసపై చెడు ప్రభావం చూపుతుంది. ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మస్కిటో కాయిల్ నుంచి వచ్చే పొగ మీ కళ్ళు, చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. కళ్ల మంట పెరగడం వల్ల సమస్యలు వస్తాయి. పొగ ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఇన్ని నిపుణులు చెబుతున్నారు. కాయిల్స్ తయారీలో ఉపయోగించే రసాయనాలను బగ్ స్ప్రే లో కూడా ఉపయోగిస్తారు. ఈ పరిస్థితుల్లో ఎక్కువ పొగ వల్ల శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.

READ ALSO : Vande Bharat : తిరుపతి- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్..6 గంటలే ప్రయాణం

Visitors Are Also Reading