ప్రస్తుతం ఏటీఎం కార్డు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇంతకు ముందు కేవలం చదువుకున్నవారే ఏటీఎం కార్డును వినియోగించేవారు. ఇప్పుడు ఎవరైనా ఏటీఎం కార్డును వినియోగించడం మెల్లగా మొదలు పెట్టారు. ముఖ్యంగా ఏటీఎం కార్డు లేకుంటే ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్ లైన్ ట్రాన్‌సాక్షన్ చేయాలన్నా ఏటీఎం తప్పనిసరి కావాల్సిందే. అయితే ప్రస్తుతం చేతలో డబ్బులు పెట్టుకునే రోజులు పోయాయి. రోజు రోజుకు టెక్నాలజీ అంతకంతకు మారిపోయింది. ముఖ్యంగా చేతిలో లేదా జేబులో లేదా పర్స్‌లో డబ్బులు పెట్టుకునే కాలం పోయింది. ఫోన్‌తోనే అన్ని లావాదేవీలు నడిపిస్తున్నారు.
Advertisement
ఎవరి వద్ద చూసినా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటివి తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. కొంత మందికి అత్యవసరంగా డబ్బు అవసరం ఉన్న సమయంలో ఏటీఎంకు వెళ్లాల్సి వస్తుంది. కానీ చాలా మంది కార్డు లేదా ఏటీఎం పిన్ మరిచిపోతుంటారు. అలాంటి వారికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ శుభవార్తనే చెప్పింది. మారిన టెక్నాలజికి అనుగుణంగా ఏటీఎంలో మార్పు చేయనున్నారు. ఇకపై నుంచి డబ్బులు డ్రా చేయడానికి వెళ్లితే చేతిలో కార్డు ఉండకపోయినా పర్వాలేదు అంటున్నారు. ఎందుకంటే..? ఏటీఎం మెషిన్ వద్దకు వెళ్లి స్మార్ట్ ఫోన్‌తో డబ్బు డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు.
Advertisement
యూపీఐ ఆప్షన్ ద్వారా ఈ అవకాశం అందుబాటులోకి రానున్నది. యూపీఐ సర్వీస్ ను సపోర్టు చేస్తున్న ప్రతి ఏటీఎంలో ఇది అందుబాటులోకి రానున్నది. యూపీఐ సర్వీస్ ను సపోర్టు చేస్తున్న ప్రతి ఏటీఎం ఇది అందుబాటులో ఉంటుంది. ముందుగా ఏటీఎం వద్దకు వెళ్లి స్కీన్‌పై యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఓ క్యూర్ కోడ్ కనిపిస్తుంటుంది. యూపీఐ యాప్ ద్వారా ఏటీఎం స్క్రీన్ పై ఉన్న కోడ్ ను స్కాన్ చేయాలి. అనంతరం ఎంత డబ్బు కావాలనే ఆప్షన్ వస్తుంది. అందులో మనకు కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేసి ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి. దీంతో లావాదేవీ ప్రాసెస్ ఫినిష్ అవుతుంది. దీనికి గరిష్ట పరిమితి ఉంటుంది. దీని ద్వారా మనం డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.
Also Read :
ఎన్టీఆర్ చిరుని తొక్కేయకుండా అల్లు రామలింగయ్య గారు ఆపరా ? తెరవెనుక ఇంత జరిగిందా..?
ప్రేమించుకుందాం రా సినిమాలో వెంకీతో జతకట్టాల్సిన ఐశ్వర్యరాయ్…కానీ అలా జరగటంతో..!