Home » ప్రేమించుకుందాం రా సినిమాలో వెంకీతో జ‌త‌క‌ట్టాల్సిన ఐశ్వర్యరాయ్…కానీ అలా జ‌ర‌గ‌టంతో..!

ప్రేమించుకుందాం రా సినిమాలో వెంకీతో జ‌త‌క‌ట్టాల్సిన ఐశ్వర్యరాయ్…కానీ అలా జ‌ర‌గ‌టంతో..!

by AJAY
Published: Last Updated on
Ad

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో ప్రేమించుకుందాం రా సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు ముందు వెంకటేష్ కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే వెంకటేష్ వరుసగా కుటుంబ కథా చిత్రాలు చేయడం నిర్మాత డి.సురేష్ బాబుకు బోర్ గా అనిపించింది. దాంతో వెంకటేష్ హీరోగా ఒక మంచి ల‌వ్ స్టోరీ తీయాల‌ని నిర్న‌యించుకున్నాడు.

Advertisement

 

ఈ నేపథ్యంలోనే దర్శకుడు జయంత్ సి పరాన్జీ తో ఒక మంచి ప్రేమ కథను సిద్ధం చేయాలని చెప్పారు. జయంత్ ప్రేమించుకుందాం రా సినిమా కథను సురేష్ బాబు కి వినిపించారు. ఈ కథ సురేష్ బాబు తో పాటు వెంకటేష్ కు కూడా చాలా భాగా నచ్చింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ రొమాంటిక్ ప్రేమకథా చిత్రం వచ్చింది. ఈ సినిమాకు మహేష్ మహదేవన్ స్వరాలు సమకూర్చారు. సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Advertisement

ఇక ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా అంజలా జవేరి హీరోయిన్ గా నటించింది. వీరిద్ద‌రి పెయిర్ స్క్రీన్ అద్బతంగా క‌నిపించింది. అయితే నిజానికి ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ ని హీరోయిన్ గా అనుకున్నారు. దర్శకుడు జయంత్ కు తన బంధువుల ద్వారా ఐశ్వర్య రాయ్ కి ఉన్న పరిచయంతో ఆమెను సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఐశ్వర్య రాయ్ అప్పటికే చేసిన‌ రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

దాంతో సెంటిమెంట్ గా వ‌ర్కౌట్ అవుతుందో లేదో అనే ఆలోచ‌న‌తో ఐశ్వర్య రాయ్ స్థానంలో అంజలా జవేరి ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ముఖ్యంగా ఈ ప్రేమ కథా చిత్రానికి యూత్ ఫిదా అయిపోయారు. 1997 మే 9న ఈ సినిమా విడుదల కాగా ఇటీవ‌లే పాతికేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా రీసెంట్ గా ప్రేమించుకుందాం రా టీం సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.

also read :

మన టాలీవుడ్ స్టార్ దర్శకుల కూతుర్ల ఫొటోస్ చూసారా ? హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోరు !

1986 లో డబల్ హ్యాట్రిక్ విజయాలతో ఇండస్ట్రీకి స్టార్ హీరో గా పేరు తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ !

Visitors Are Also Reading