Telugu News » పండుగ వేళ అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్ చెప్పిన మ‌మ్ముట్టి

పండుగ వేళ అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్ చెప్పిన మ‌మ్ముట్టి

by Anji

రోజు రోజుకూ దేశ‌వ్యాప్తంగా కొవిడ్ మ‌హ‌మ్మారి భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్న‌ది. వారు, వీరు అని తేడా లేకుండా అంద‌రినీ ట‌చ్ చేస్తోంది. ముఖ్యంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌ను అస్స‌లు వ‌ద‌ల‌డం లేదు క‌రోనా. రోజు రోజుకు క‌రోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. స్టార్లు అంద‌రూ క‌రోనా బారిన ప‌డి ఐసోలేష‌న్‌లో ఉండ‌టంతో వారి అభిమానులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతూ ఉన్నారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్,మాలీవుడ్ ఇలా అది ఇది అని తేడా లేకుండా అన్ని చోట్లలో క‌రోనా విళ‌య‌తాండ‌మే సృష్టిస్తోంది.

Ads

mammootty

తాజాగా మాలీవుడ్ మెగాస్టార్ మ‌మ్ముట్టి క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌కు వెల్ల‌డించారు. అవ‌స‌రం అయిన జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ కొవిడ్ బారిన ప‌డిన‌ట్టు తెలిపాడు. తేలిక‌పాటి జ్వ‌రం త‌ప్ప నేను బాగానే ఉన్నాను. సంబంధిత అధికారుల సూచ‌న‌ల మేర‌కు ఇంట్లోనే ఐసోలేష‌న్‌లో ఉన్నాను. మీరంద‌రూ క్షేమంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను. ఎల్ల‌వేళ‌లా మాస్క్ వేసుకుని జాగ్ర‌త్త వ‌హించండి అని సూచించారు. ముఖ్యంగా పండుగ స‌మ‌యంలో ఇలాంటి వార్త వినాల్సి వ‌స్తుంద‌ని అస‌లు అనుకోలేద‌ని.. మ‌మ్ముట్టి త్వ‌ర‌గా కోలుకోవాలి అని ఆయ‌న అభిమానులు కామెంట్లు పోస్ట్‌ చేస్తున్నారు.


You may also like