ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1998 డీఎస్సీ అభ్యర్థుల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు దశాబ్దాలుగా ఉద్యోగాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కుటుంబాల్లో సంతోషం నింపింది. ఈ తరుణంలో ఉద్యోగాలపై ఆశలు వదులుకొని వేర్వేరు వృత్తుల్లోకి చిన్న, చితకా ఉద్యోగాల్లో చివరికి రాజకీయాల్లో కూడా వెళ్లిన పలువురికీ తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ కోవలోనే అనకాపల్లి జిల్లా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈ ఉద్యోగానికి అర్హత సాధించాడు.
Advertisement
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావంతో పలు అద్భుతాలే చేటుచేసుకున్నాయి. 22 ఏళ్ల కిందట డీఎస్సీ రాసిన అభ్యర్థులు ఉద్యోగాలు రాకపోవడంతో ఇక చాలు అనుకుని ఆశలు వదిలేసుకున్నారు. వారు వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. ఇప్పుడు వారందరూ సీఎం జగన్ ప్రకనటతో తిరిగి ఉద్యోగాల్లో చేరడానికి సిద్ధమవుతున్నారు. మరికొందరూ ఇతర వృత్తులలో స్థిరపడి తిరిగి వెనక్కి రాలేని స్తితిలో ఉన్నారు. రాజకీయాలు, వ్యాపారాలు ఉన్నవారు వెనక్కి రావడానికి సిద్ధంగా లేరు. టీచర్ ఉద్యోగంపై ఆశలు వదులుకుని వీధుల్లో తిరిగి వస్తువులు అమ్ముకుంటున్న ఓ అభ్యర్థి తనకు ఉద్యోగం వచ్చిందని తెలియగానే ట్రిమ్‌గా తయారైన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
1998 డీఎస్సీ అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాలో తాజాగా వైసీపీకి చెందిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేరు కూడా వినిపించింది. ఎప్పుడు 30 సంవత్సరాల కిందట మద్రాస్ అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చదివి.. 1998లో డీఎస్సీ పరీక్ష రాశాడు. ఉద్యోగం రాదు అని డిసైడ్ అయి రాజకీయాల్లోకి వచ్చాడు. ఎమ్మెల్యే అయిన తరువాత ఇప్పుడు సీఎం జగన్ నిర్ణయంతో ఉద్యోగానికి అర్హుడయ్యాడు. ఇక అప్పుడే తనకు ఉద్యోగం వచ్చి ఉంటే టీచర్‌గానే స్థిరపడేవాడిని.. రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు అని ధర్మశ్రీ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఉద్యోగం రాకపోవడంతో ఆ తరువాత బీఎల్ చేశానని.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో యువజన నేతగా పని చేసి ఆ తరువాత వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్యే అయినట్టు గుర్తు చేసుకున్నారు. 1998 డీఎస్సీ బ్యాచ్ తరుపున ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.