Home » మిస్​ వరల్డ్​గా పోలాండ్​ సుందరి.. రన్నరప్​గా భారత యువతి

మిస్​ వరల్డ్​గా పోలాండ్​ సుందరి.. రన్నరప్​గా భారత యువతి

by Anji
Ad

70వ ప్ర‌పంచ సుంద‌రీ పోటీలు ప్యూర్టోరికోలో నిర్వ‌హించారు. పోలాండ్‌కు చెందిన క‌రోలినా బిలాస్కా కిరిటాన్ని ద‌క్కించుకున్నారు. పోటీల‌లో పాల్గొన్న తెలుగు అమ్మాయి మాన‌సా వార‌ణాసి కూడా ఎంతో క‌ష్ట‌ప‌డి సెమి ఫైన‌ల్స్‌లో చోటు ద‌క్కించుకుంది. మిస్ వ‌ర‌ల్డ్ 2021 పోటీలు డిసెంబ‌ర్‌లోనే జ‌రగాల్సి ఉన్నా.. కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డ్డాయి. 70వ మిస్ వ‌రల్డ్ కిరీటాన్ని ద‌క్కించుకున్న క‌రోలినా బిలాస్కా కు అంద‌రూ అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆ త‌రువాత తొలి ర‌న్న‌రప్ గా అమెరికా కు చెందిన శ్రీ‌సైనీ నిలువ‌గా.. సెకండ్ ర‌న్న‌రప్‌గా కాట్ లివోరీ దేశానికి చెందిన ఒలీవియా ఏస్ నిలిచారు.

Advertisement

Advertisement

మిస్ ఇండియా కిరీటాన్ని ద‌క్కించుకుని మిస్ వ‌ర‌ల్డ్ కూడా కావాల‌నుకున్న మాన‌సా వార‌ణాసి ఫైనల్స్ వ‌ర‌కు కూడా చేరుకోలేక‌పోయింది. సెమీ ఫైన‌ల్స్‌లో టాప్ 13 కంటెస్టెంట్స్‌లో తాను కూడా ఒక‌టిగా నిలిచిపోయింది. కానీ మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌లో సెమీఫైన‌ల్స్ వ‌ర‌కు వెళ్ల‌డం కూడా మాట‌లు కాదు. ఈ పోటీల‌లో ప్ర‌పంచ సుంద‌రిగా ఎన్నికైన క‌రోలినా ప్ర‌స్తుతం మేనేజ్‌మెంట్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీని కొన‌సాగిస్తుంది. పీహెచ్‌డీతో చేయాల‌నుకుంటున్నార‌ట‌. క‌రోలినా మోడ‌ల్‌గా కూడా ప‌ని చేస్తున్నారు. అంతేకాదు స్విమ్మింగ్, స్కూబా డ్రైవింగ్‌, టెన్నిస్‌, బ్యాడ్మింట‌న్ ఆడ‌టం అంటే చాలా ఇష్ట‌మ‌ట‌.

69వ మిస్ వ‌ర‌ల్డ్ టోనీ ఆన్ సింగ్ కిరీటం పొందిన త‌రువాత క‌రోలినా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. క‌న్నీటితో త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఈ సంతోష స‌మ‌యంలో క‌రోలినా మాట్లాడుతూ.. విన్న‌ర్ నా పేరు విన‌గానే నేను షాక్ అయ్యాను. నేను ఇప్ప‌టికీ న‌మ్మ‌లేక‌పోతున్నాను. ప్ర‌పంచ సుందరి కిరీటాన్ని ధ‌రించ‌డం నాకు గౌర‌వంగా ఉంది. ఇది నా జీవితంలో మ‌రిచిపోలేని ఘ‌ట్టం అని నేను నా జీవితాంతం గుర్తుంచుకుంటానంటూ క‌రోలినా సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

Also Read :  Chanakya Niti : ఇలాంటి లైఫ్ పార్ట్‌న‌ర్ దొరికితే వారికి అదృష్ట‌మే అంటున్న చాణ‌క్య

Visitors Are Also Reading