ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదల అయింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో అదనపు షోలకు అనుమతులు లభించడంతో ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు 150 కోట్ల రూపాయలు దాటవచ్చని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
Also Read: RRR Movie : ముక్కుతో రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ లను గీసిన ఆర్టీస్ట్..!
Advertisement
ఆర్ఆర్ఆర్ సినిమాకు అభిమానుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ ఈ సినిమాను చూసే ప్రేక్షకులు కొన్ని అంశాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. బాహుబలి సిరీస్, కేజీఎఫ్ తరహాలో ఈ సినిమాలో పదే పదే ఎలివేషన్ సీన్లు వస్తాయని భావిస్తే మాత్రం వాళ్లకు నిరాశ తప్పదు. ముఖ్యంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్‌తో ఓ నూతన ప్రయోగం చేసారనే చెప్పాలి. కథను ఏ మాత్రం రివీల్ చేయకుండా జక్కన్న జాగ్రత్త పడటం ఈ సినిమాకు కలిసొచ్చింది. బాహుబలి వంటి హిట్ సినిమాలను తీసిన దర్వకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ విషయంలో కాస్త తడబడ్డాడనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా మల్టీస్టారర్ కావడంతో ఎన్టీఆర్ అటు రామ్‌చరణ్‌ఇద్దరి అభిమానులను మెప్పించే ప్రయత్నం చేసినప్పటికీ.. రాజమౌళి మాత్రం చిన్న లాజిక్ మిస్ అయ్యాడు.
Advertisement
ముఖ్యంగా ఈ సినిమాలో బ్రిటిష్ వారి వాయిస్ కు మధ్య మధ్యలో రానా డబ్బింగ్ చెప్పాడు. కానీ ఇంగ్లీషు వాయిస్‌కు తెలుగు వాయిస్‌కు పొంతన లేకుండా అప్పుడప్పుడు చాలా గ్యాబ్ ఎక్కువగా వచ్చింది. అదేవిధంగా బ్రిటీష్ వారి వాయిస్ కేవలం ఇంగ్లీషులోనే రావడంతో తెలుగు ప్రేక్షకులకు కొన్ని సందర్భాల్లో సినిమా అంతగా అర్థం కాలేదు. దర్శక ధీరుడు ఇటువంటి చిన్న లాజిక్‌ను ఎలా మిస్సయ్యాడో అంటూ పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏదీ ఏమైనప్పటికీ మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చెప్పవచ్చు.
Also Read : ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉపాసన రివ్యూ…ఏం చెప్పిందంటే !