Home » ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉపాస‌న రివ్యూ…ఏం చెప్పిందంటే !

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉపాస‌న రివ్యూ…ఏం చెప్పిందంటే !

by AJAY
Ad

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్నో అంచ‌నాల మ‌ధ్య నేడు థియేట‌ర్ ల‌లో విడుద‌లైంది. కాగా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వ‌స్తున్నాయి. చ‌ర‌ణ్ ఎన్టీఆర్ న‌ట‌న కు ప్ర‌శంస‌లు అవ‌స్తున్నాయి. ఓవ‌రాల్ గా కూడా సినిమా సూప‌ర్ అని బ్లాక్ బ‌స్ట‌ర్ అని చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లు కూడా ఈ సినిమాను థియేట‌ర్ల‌లో చూసి ఎంజాయ్ చేశారు.

rrr-movie-review

Advertisement

Advertisement

అంతే కాకుండా రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల కూడా ఆర్ఆర్ ఆర్ సినిమాను త‌న స్నేహితుల‌తో క‌లిసి నిన్న థియేట‌ర్ ల‌లో చూశారు. సినిమా చూస్తున్న సమయంలో రామ్ చ‌ర‌ణ్ ఎంట్రీ ఇవ్వ‌గానే ఉపాస‌న కేక‌లు వేశారు. చ‌ర‌ణ్ వీరాభిమానిలా మారిపోయారు. అంతే కాకుండా థియేట‌ర్ లో పేప‌ర్లు చింపి గాల్లో విసిరారు. థియేట‌ర్ లో అరుపులు చూసి ఉపాస‌న షాక్ అయ్యారు. మిగితా ఫ్యాన్స్ లో ఉపాస‌న కూడా క‌లిసి సినిమాను ఎంజాయ్ చేశారు.

ఇక సినిమా చూసిన అనంత‌రం ఎలా ఉందంటూ మీడియా ఉపాస‌నను ప్ర‌శ్నించారు. సినిమాలో చ‌ర‌ణ్ ప‌ర్ఫామెన్స్ ఎలా ఉందంటూ ప్ర‌శ్నించ‌గా ఆర్ఆర్ఆర్ ఫ్యామిలీ మొత్తం అద‌ర‌గొట్టారు అంటూ ఉపాస‌న వ్యాఖ్యానించారు. సూప‌ర్ అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ సినిమాకు అన్ని న‌గ‌రాల్లో థియేట‌ర్లు హౌస్ ఫుల్ తో ర‌న్ అవుతున్నాయి.

Visitors Are Also Reading