ఆరు గ్యారంటీల అమలు మీ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ గడువు అయిపోవడంతో దీని మీద నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. గ్యారంటీల అమలులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ప్రకటించారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో తప్పకుండా అమలుచేస్తామని అన్నారు. నిజమైన అర్హుల కోసం దరఖాస్తులు అప్లై చేసిన ప్రతీ ఒక్కరి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తామని చెబుతున్నారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని…వంద రోజుల్లో ఆరు గ్యాంటలీను తప్పకుండా అమలు చేస్తామని పొంగులేటి చెప్పారు.
Advertisement
Advertisement
ఆరు గ్యాంటీల అమలులో భాగంగా ప్రవేశపెట్టిన అభయహస్తం కోసం కోటీ ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి తెలిపారు. మరో 20 లక్షల దరఖాస్తులు రేషన్ కార్డులు, ఉద్యోగాలు, భూ సమస్యలపైనా వచ్చాయన్నారు. ప్రతి అర్హుడికి లబ్ధి చేకూరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని… ఈ నెల 30లోగా డేటా ఎంట్రీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డేటా ఎంట్రీ అప్పుడే మొదలుపెట్టామని…30వేలమందికి పైగా ఆపరేటర్లతో యుద్ధప్రాతిపదికన డేటా ఎంట్రీ కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటికే 13 నుంచి 14 శాతం వరకు ఎంట్రీ పూర్తయిందని చెప్పారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డులను లింకప్ చేసిన నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ హామీలన్నీ అందిస్తామని పొంగులేటి మాట ఇచ్చారు.
ఆరు గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వం పట్టుదలగానే ఉందని…ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తుందని మంత్రి పొంగు శ్రీనివాస్ అన్నారు. ఈ క్రమంలో ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అన్నీ చేస్తాం..వంద రోజులు ఓపిక పట్టండి. మామీల పట్ల ప్రజలు సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు. దీని మీద వచ్చే తప్పుడు సమాచారాలను నమ్మొద్దని అన్నారు. ఆరు గ్యారంటీల అమలు మీద దుష్ప్రచారం చేస్తే మాజీ మంత్రులైనా వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని వార్నింగ్ కూడా ఇచ్చారు మంత్రి పొంగులేటి.