దర్శక ధీరుడు రాజమౌలి-సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసిన అప్పటినుంచి అంచనాలు భారీగా పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా పనుల్లో బిజీ అవ్వనున్నాడు. ఒక సినిమా చేయడానికి దాదాపు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు సమయం తీసుకుంటాడు రాజమౌళి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే మరి ఎంత సమయం తీసుకుంటాడు అనే భయం అందరిలోనూ నెలకొంది. దాని అవుట్ ఫుట్ కూడా ఓ పది సంవత్సరాలు చెప్పుకునేలా ఉంటుంది. మహేష్ బాబు అభిమానులు ఈ సినిమాపై చాలా నమ్మకం గానే ఉన్నారు.
Advertisement