Home » Michael OTT : “మైఖేల్” ఓటిటి డేట్ ఫిక్స్… ఎందులో స్ట్రీమింగ్ కానుంది అంటే?

Michael OTT : “మైఖేల్” ఓటిటి డేట్ ఫిక్స్… ఎందులో స్ట్రీమింగ్ కానుంది అంటే?

by Bunty
Ad

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ఏంత చెప్పినా తక్కువే అవుతుంది. యువ హీరోల్లో అసలు ఏ మాత్రం లక్ కలిసిరాని హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సందీప్ కిషన్ అని చెప్పొచ్చు. ఈ తరుణంలోని సందీప్ కిషన్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్, హీరో వరుణ్ సందేశ్, అనసూయ కీలకపాత్రలో నటించారు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కోసం సందీప్ కిషన్ చాలా కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేశాడు.

Advertisement

ఏకంగా 24 కిలోల వరకు బరువు కూడా తగ్గారు. ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసాడు. పైగా ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలకపాత్రలో కనిపించాడు. డైరెక్టర్ గౌతమ్ మేనన్ విలన్ గా నటించాడు. వరుణ్ సందేశ్, అనసూయ, వరలక్ష్మి శరత్ కుమార్ కీరోల్ ప్లే చేశారు. కానీ డైరెక్టర్ రంజిత్ జయకోడి అనుకున్న స్థాయిలో మైఖేల్ తో మెప్పించలేకపోయాడు. సినిమా మేకింగ్, టేకింగ్ బాగున్నాయని పేరు వచ్చింది. కానీ, ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.

Advertisement

ఫిబ్రవరి 3న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. మైఖేల్ అయితే సినిమా టాక్ తేడా కొట్టడంతో, మూడు వారాల్లోనే ఓటీటీ బాట పట్టింది. మైఖేల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఆహా ఓటిటి సొంతం చేసుకుంది. దాంతో ఈ నెల 24 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా, ‘రెడీగా ఉండండి, పిచ్చెక్కించే యాక్షన్ తో రాబోతున్నాడు మన మైఖేల్, నాన్ స్టాప్ యాక్షన్ ఎంటర్టైనర్’ అని రాసుకోచ్చారు ఆహా వారు. మరి ఓటిటిలో అయినా మైఖేల్ ఆకట్టుకుంటాడేమో చూడాలి.

READ ALSO : బన్నీకి షాక్.. పుష్ప-2 ఆఫర్ ను తిరస్కరించిన సమంత!

Visitors Are Also Reading