Home » బన్నీకి షాక్.. పుష్ప-2 ఆఫర్ ను తిరస్కరించిన సమంత!

బన్నీకి షాక్.. పుష్ప-2 ఆఫర్ ను తిరస్కరించిన సమంత!

by Bunty
Ad

అల్లు అర్జున్ హీరోగా 2021 చివరలో వచ్చిన సినిమా పుష్ప. బన్నీ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన దీనికి సుకుమార్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇంకా ఈ సినిమాపై తెలుగులో అంచనాలు ఎక్కువే ఉన్నా హిందీలో మాత్రమే ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్లి సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో దీని పార్ట్ 2 కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇక సుకుమార్ సినిమా అంటే ఐటమ్ సాంగ్ లేకుండా ఉండదు.

Advertisement

 

ఈ విషయాన్ని ఆయనే గతంలో కూడా కొన్నిసార్లు చెప్పాడు. దానికి తగిన విధంగానే పుష్ప సినిమాలో ఉన్న ఐటమ్ సాంగ్ అనేది మొత్తం దేశాన్ని ఊపేసింది. ఇందులో స్టార్ హీరోయిన్ సమంత కనిపించిన విషయం తెలిసిందే. ఆ పాట అనేది సమంతకు బాగా హెల్ప్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా పుష్ప-2 సినిమా పనులు శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పుష్ప-2 లో కూడా ఐటమ్ సాంగ్ కోసం మూవీ యూనిట్ సమంతని కాంటాక్ట్ అయ్యిందని,

Advertisement

కానీ ఈ ఆఫర్ ని సమంత రిజెక్ట్ చేసిందని వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ రూమర్స్  పై సమంత టీం రియాక్ట్ అయింది. ఇందు లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. పుష్ప నిర్మాతలు సమంతని సంప్రదించలేదని తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని సమంత టీమ్ స్పష్టం చేసింది. ఇక సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ నుంచి కోలుకుంటుంది.

 

READ ALSO : చిరంజీవి అంత పెద్ద తప్పు చేశాడా ? తన అల్లుళ్ళకి అలాంటి కండిషన్స్ పెట్టి టార్చర్‌ పెట్టేశాడా ?

Visitors Are Also Reading