Home » స్త్రీ పురుషులు ఆ ఒక్క విషయంలో రాజీ పడకూడదట.. అదేంటంటే..?

స్త్రీ పురుషులు ఆ ఒక్క విషయంలో రాజీ పడకూడదట.. అదేంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

చాణిక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా అనేక విషయాలను బోధించాడు. ముఖ్యంగా భార్యాభర్తలు ఎలా మెదలాలి? వారి మధ్య సంబంధం కొనసాగాలి అంటే ఏ విధంగా ఉండాలి ?అనే విషయాలను చెప్పాడు. చాణక్యుడు నీతి శాస్త్రం ప్రకారం చాలామంది వారి జీవితంలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లే వారు ఉన్నారు. అలా వెళ్లి వారి జీవితాలను సెట్ చేసుకొని ముందుకు సాగిన వారు అనేకం. చాణక్య నీతి ప్రకారం వ్యక్తి యొక్క విజయానికి మరియు వైఫల్యానికి అతడి యొక్క చర్యలే కారణమని చాణిక్యుడు అన్నాడు.

Advertisement

Also read;నోటి నుంచి దుర్వాసన వస్తుందా అయితే ఏం చేయాలంటే..?

సమాజంలో గౌరవం పొందాలన్నా కొన్ని సంవత్సరాలు పడుతుంది.. కానీ తప్పులు చేస్తే ఒక్క క్షణంలో ఆ గౌరవం పోతుంది. కాబట్టి ప్రతి మానవుడు కొన్ని విషయాల్లో అస్సలు రాజీ పడకూడదు అని చాణిక్యుడు అంటున్నారు. అవి ఎలాంటి దుర్భర పరిస్థితులు వచ్చినా తగ్గకూడదని వారు తెలియజేస్తున్నారు. కొన్ని ఏళ్ల నుంచి సంపాదించుకున్న గౌరవం మట్టి కొట్టుకుపోతుంది అంటే , మన జీవితంలో మచ్చ ఏర్పడుతుంది అని అర్థం. ఆత్మగౌరవం అనేది మనసుకున్న మూలధనం. మనిషి దాన్ని చనిపోయే వరకు కాపాడుకుంటూ ఉంటాడు.

Advertisement

మీ ఆత్మగౌరవం దెబ్బతినని చోట మాత్రమే మీరు ఎవరికైనా నమస్కరించండి అని కూడా చెప్పారు. మీరు మీ యొక్క ఉనికిని ఫణంగా పెట్టినప్పుడు మీకు చెడ్డ పేరు వస్తుంది. అది చెరిపేసిన చెరిగిపోదు. కాబట్టి జీవితంలో ఆత్మగౌరవం విషయంలో అస్సలు రాజీ పడకూడదని చాణక్యుడు అంటున్నారు. సాధారణంగా వ్యక్తి మానసికంగా శారీరకంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే ఆత్మగౌరవం విషయంలో రాజీ పడవలసి వస్తుందని అంటున్నారు. అలాంటి ఆత్మగౌరవం నిలబెట్టుకున్న వారే నిజమైన మనిషి అని చాణక్యుడు తెలిపారు.

ALSO READ:ఆ ఒక్క అమ్మాయి వల్లే రజనీకాంత్ ఇంతటి స్టార్ హీరో అయ్యారు.. ఇంతకీ ఆమె ఎవరంటే..?

Visitors Are Also Reading