Home » ఆ ఒక్క అమ్మాయి వల్లే రజనీకాంత్ ఇంతటి స్టార్ హీరో అయ్యారు.. ఇంతకీ ఆమె ఎవరంటే..?

ఆ ఒక్క అమ్మాయి వల్లే రజనీకాంత్ ఇంతటి స్టార్ హీరో అయ్యారు.. ఇంతకీ ఆమె ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ గా రజినీకాంత్ పేరు తెచ్చుకున్నారు.బస్ కండక్టర్ గా తన కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా,హీరోగా రాణిస్తూ నేడు దేశం గర్వించదగ్గ హీరోగా మంచి స్థానంలో కొనసాగుతున్నారు. అలాంటి రజనీకాంత్ జీవితం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అంతటి స్టార్ రేంజ్ కు రావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. కానీ ఆయన ఒకానొక సమయంలో ఈ రేంజ్ కు రావడానికి ఒక అమ్మాయి కారణమని తెలియజేశారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. రజనీకాంత్ బస్ కండక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో ఇండస్ట్రీలోకి అడుగు వేయడానికి ఒక మహిళ కారణమని చెప్పుకొచ్చారు.

Advertisement

Also read;వేణు స్వామి చెప్పిన‌ట్టే న‌య‌న‌తార జీవితంలో స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయా..?

తనలోని ప్రతిభను గుర్తించిన ఆ మహిళ తనకు తెలియకుండా ఒక ఫిలిం ఇనిస్టిట్యూట్ లో అప్లై చేసిందని, కనీసం ఆ ఇన్స్టిట్యూట్ కి వెళ్లే పరిస్థితి రజినీకాంత్ కి లేకపోవడంతో 500 రూపాయలు ఇచ్చి మరీ అక్కడికి పంపిందని ఆయన అన్నారు. ఆయన ఇంతటి ఎత్తుకు ఎదగడానికి కారణం ఆవిడే అని తెలియజేశారు. అయితే రజనీకాంత్ ఆమె కు కృతజ్ఞతలు చెప్పడం కోసం ఇప్పటికి కూడా ఎదురు చూస్తున్నారట. కానీ ఆ అమ్మాయి ఎవరో ఇప్పటికీ ఆయనకు దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన సినిమాల్లోకి రాకముందు బెంగళూరులో కండక్టర్ గా ఉద్యోగం చేసేవారు. ఆరోజుల్లోనే ఎంబిబిఎస్ చేసే ఒక అమ్మాయి తరచుగా రజనీకాంత్ డ్యూటీ చేసే బస్సులోనే వచ్చేది.

Advertisement

వీరిద్దరి మధ్య క్రమంగా పరిచయం పెరిగి ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ఈ క్రమంలో రజనీకాంత్ నాటకాలు కూడా వేసేవారు. ఈ నాటకాలకు ఆ అమ్మాయిని కూడా ఆహ్వానించేవాడు. అలా వీరిద్దరి మధ్య పరిచయం పెరగడంతో ఆ అమ్మాయి రజినీకాంత్ లో ఉండే నటనను గుర్తించి రజనీకాంత్ కోసం సినిమా ఇన్స్టిట్యూట్ కి అప్లై చేసింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రజినీకి చెన్నైలోని ఓ ఇన్స్టిట్యూట్ కి రావాల్సిందిగా ఒక లెటర్ వచ్చింది. కానీ రజనీకాంత్ ఇది అప్లై చేయలేదు. నాకు తెలియకుండా ఎవరు అప్లై చేసారో అంటూ ఆశ్చర్యపోయారు. ఆ విధంగా ఆయన కండక్టర్ గా డ్యూటీలో ఉన్న సమయంలో ఆ అమ్మాయి లెటర్ వచ్చిందా అని అడిగిందట.. దీంతో ఆశ్చర్యపోయిన రజిని నువ్వే అప్లై చేసావా అని అడిగితే అవును అని సమాధానం ఇచ్చిందట..

అంతేకాకుండా వెంటనే జాయిన్ అవ్వు అంటూ తెలిపిందట.. దీంతో రజినీకాంత్ అక్కడికి వెళ్లడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అని సమాధానం ఇవ్వడంతో తన దగ్గర ఉన్న 500 రూపాయలు ఇచ్చి మరీ ప్రోత్సహించిందని తెలిపారు. అంతేకాకుండా ఆ అమ్మాయి నువ్వు గొప్ప నటుడు అవుతావు నీలో చాలా టాలెంట్ ఉంది అని అన్నదట. ఈ విధంగా రజనీకాంత్ ఆ అమ్మాయి ఇచ్చిన ప్రోత్సాహంతో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లోకి వచ్చి ఇండస్ట్రీలో మెల్లిమెల్లిగా ఎదుగుతూ సూపర్ స్టార్ గా మారారు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఆ తర్వాత కనిపించలేదు. దీంతో ఆ అమ్మాయి కోసం చాలా వెతికాడట రజనీకాంత్. ఆమె ఉన్న రూమ్ కి కూడా వెళ్లి ఆరా తీశారు. కానీ అడ్రస్ లభించలేదు. అయినా రజనీకాంత్ ఆ అమ్మాయి మాటతో పెద్ద స్టార్ హీరోగా మారారు.

Also read;రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ది కూడా విగ్గే…ఇదే సాక్ష్యం ?

Visitors Are Also Reading