Home » నోటి నుంచి దుర్వాసన వస్తుందా అయితే ఏం చేయాలంటే..?

నోటి నుంచి దుర్వాసన వస్తుందా అయితే ఏం చేయాలంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

చాలామంది నోటి దుర్వాసనతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారు నోరు తెరిస్తే చాలు కంపు కొడుతుంది. వారు నలుగురిలో మాట్లాడడానికి అనేక ఇబ్బందులు పడతారు. ఎందుకంటే వారి నోటి నుంచి వాసన వస్తుంది కాబట్టి. మరి ఈ నోటి దుర్వాసన కు కారణం మనం తినే ఆహారపదార్థాలే అని వైద్యులు అంటున్నారు.. నోటి దుర్వాసన రావడానికి ప్రధానంగా కారణం నోరే. ముక్కు చుట్టుపక్కల ఉండే గాలి గదులు, గొంతు, ఊపిరితిత్తులు,అన్నవాహిక, జీర్ణాశయం వల్ల నోరు దుర్వాసన వస్తుంది. అంతేకాకుండా కాలేయ వైఫల్యం వల్ల కూడా ఇది రావచ్చు.

Advertisement

Also read;టాలీవుడ్‌ లో బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్నా..హీరోయిన్లుగా అట్టర్‌ ఫ్లాఫ్‌ అవుతున్న తారలు వీరే !

Advertisement

మన నోట్లో 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. శ్వాస వదులుతున్నప్పుడు 96శాతం తేమ ఉంటుంది. ఇది బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి కారణం అవుతుంది. వీటిలో ఉండే చెడు బ్యాక్టీరియా వల్ల మన నోరు దుర్వాసన వస్తుంది. మనం ఏదైనా ఆహారం తిన్న తర్వాత శుభ్రంగా కడుక్కపోతే అది మరింత పెరిగి నలుగురిలో మనల్ని తిరగకుండా చేస్తుంది. అంతేకాకుండా చిగుళ్ల వాపు వల్ల కూడా దుర్వాసన వస్తుంది. అంతేకాకుండా మనం తినే ఆహార పదార్థాలు, రసాయనాలు ఉండే ఉల్లిగడ్డ, వెల్లుల్లి వంటివి తిన్నప్పుడు సల్ఫర్ రసాయనాలు రక్తం ద్వారా చేరుతాయి.

ఇవి శ్వాస ద్వారా బయటకు వస్తాయి. ఈ సమయంలోనే నోరు దుర్వాసన వస్తుంది. గ్యాస్,అల్సర్ వంటివి దుర్వాసనకు కారణాలుగా నిలుస్తాయి. ఒక్కోసారి సమయానికి తినకపోవడం వాళ్ల కూడా నోటి దుర్వాసన పెరుగుతుంది. ఈ దుర్వాసన రాకుండా ఉండాలంటే ముఖ్యంగా నోరు శుభ్రంగా చేసుకోవాలి. రోజు ఉదయం సాయంత్రం రెండు పూటల బ్రష్ చేసుకోవాలి. చిగుళ్లలో వాపు రాకుండా చూసుకోవాలి.. ఇలా చేసుకోవడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది..

Also read;తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..డిసెంబ‌ర్‌ లోగా 950 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ పోస్టింగ్‌లు

Visitors Are Also Reading