Home » పిల్లలకు తల్లి ప్రేమతో పాటు తండ్రి ప్రేమ కూడా కావాలి.. కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్!

పిల్లలకు తల్లి ప్రేమతో పాటు తండ్రి ప్రేమ కూడా కావాలి.. కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ నుంచి విడాకులు తీసుకొని విడిపోయారు అంటూ గత కొద్ది కాలంగా తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకొని విడిపోయారు. కానీ ఈ విషయాన్ని ఫ్యామిలీ మాత్రం  బయటపెట్టడం లేదనే విషయం తెలుస్తోంది. శ్రీజ, కళ్యాణ్  దంపతులు విడాకులు తీసుకొని విడిపోవడంతో పిల్లలు శ్రీజ వద్దనే ఉంటున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. 

Also Read :   ది కేరళ స్టోరీకి భారీ వసూళ్లు.. 37 దేశాల్లో విడుదలకు సిద్ధం..!

Advertisement

శ్రీజ గతంలోనే ఓ పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఈమెకు అప్పటికే ఓ కుమార్తె  కలదు. ఆ తరువాత కళ్యాణ్ దేవ్ ని రెండో పెళ్లి చేసుకుంది శ్రీజ. కళ్యాణ్, శ్రీజ దంపతులకు ఓ కుమార్తె ఉంది. వీరిద్దరి కుమార్తెలను కూడా ప్రస్తుతం శ్రీజ తన వద్దనే ఉంచుకున్నారు. విడాకులు తీసుకొని విడిపోయిన తరువాత కళ్యాణ్ దేవ్ మాత్రం ఇద్దరు కుమార్తెలను చాలా మిస్ అవుతున్నాను అంటూ తరచూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్న విషయం విధితమే. కళ్యాణ్ దేవ్ సొంత కుమార్తె నవిష్క అయినప్పటికీ నివృత్తిని కూడా సొంత కూతురుగానే భావించి తనతో మంచి బాండింగ్ ఏర్పరచుకున్నారు.

Advertisement

Manam News

తరచూ తన కూతుర్లను మిస్ అవుతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా తన బాధను బయటపెట్టాడు కళ్యాణ్. తాజాగా ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తన కూతుర్లను మిస్ అవుతున్న విషయాన్ని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇన్ స్టా గ్రామ్ స్టోరీ ద్వారా ఈయన ఓ వీడియో షేర్ చేసారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో జరిగే ఏ ఫంక్షన్ లో కూడా కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడం గమనార్హం. తన కూతుర్లను మిస్ అవుతున్నానంటూ కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది. మరోవైపు శ్రీజ కూడా మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తుండటంతో వీరి గురించి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే మాత్రం అధికారికంగా వారు ప్రకటిస్తే కానీ క్లారిటీ రాదు.   

Also Read :  ఓటీటీలో ఆది మూవీకి అద్భుతమైన రెస్పాన్స్..!

Visitors Are Also Reading