Home » ఓటీటీలో ఆది మూవీకి అద్భుతమైన రెస్పాన్స్..!

ఓటీటీలో ఆది మూవీకి అద్భుతమైన రెస్పాన్స్..!

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన ఆది సాయికుమార్ సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఏడాదిలో సుమారు నాలుగు, ఐదు సినిమాలతో ప్రేక్షకులను పలుకరిస్తున్నాడు యంగ్ హీరో. గత ఏడాది ఏకంగా ఏకంగా ఐదు సినిమాలు చేసిన ఆది సాయికుమార్ ఈ ఏడాది సీఎస్ఐ సనాతన్ మూవీతో మన ముందుకొచ్చాడు. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కించిన ఈ మూవీ 10న విడుదలైంది. 

Also Read :  Sai pallavi marriage:పెళ్లి చేసుకోబోతున్న సాయి పల్లవి.. వరుడు ఆయనేనా..?

Advertisement

థియేటర్లలో  ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆది సాయికుమార్ యాక్షన్ సీక్వెన్స్ కి తోడు, ఆసక్తికరమైన కథా, కథనాలు ప్రేక్షకులను మెప్పించాయి. థియేటర్లలో ఓ మోస్తారు హిట్ గా నిలిచిన ‘సీఎస్ఐ’ సనాతన్ సినిమా ఓటీటీలో విడుదలైంది.  రెండు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో మే 10 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీ యాప్ లో ఆది సాయికుమార్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆది సాయికుమార్ గత సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలలో మాత్రం సూపర్ రెస్పెన్స్ వస్తోంది. ఇప్పుడూ జాబితాలో సీఎస్ఐ సనాతన్ చేరింది. 

Advertisement

Also Read :  Prabhas:ప్రభాస్ ఆది పురుష్ తెలుగులో టార్గెట్ ఏంతో తెలుసా..?

Manam News

ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కావడంతో ఓటీటీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. సీఎస్ఐ సనాతన్ ఆదిసాయికుమార్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నటించి మెప్పించారు. అతని సరసన మిషా నారంగ్ కథానాయికగా నటించింది. నందినిరాయ్, అలీ రెజా, ఖయ్యూం, రవి ప్రకాశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చాగంటి ప్రొడక్షన్ పతాకంపై అజయ్ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకి శివశంకర్ దేవ్ దర్శకత్వం వహించారు. అనిష్ సోలోమన్ సంగీతం, గంగనమోని శేఖర్ సినిమాటోగ్రఫీ అందించారు. థియేటర్లలో సీఎస్ఐ సనాతన్ మిస్ అయిన వారు ఇంకెందుకు ఆలస్యం చూసేయ్యండి.  

Also Read :  ఆ ఇద్దరూ హీరోల గురించి ప్రియమణి ఏమందో తెలుసా ?

Visitors Are Also Reading