Home » ది కేరళ స్టోరీకి భారీ వసూళ్లు.. 37 దేశాల్లో విడుదలకు సిద్ధం..!

ది కేరళ స్టోరీకి భారీ వసూళ్లు.. 37 దేశాల్లో విడుదలకు సిద్ధం..!

by Anji
Ad

ఆదాశర్మ నటించిన ది కేరళ స్టోరీ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం అందరికీ తెలిసిందే. లవ్ జిహాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ రాజకీయంగా సెగలు రేకెత్తిస్తోంది.  ది కేరళ స్టోరీకి భారతీయ జనతా పార్టీ నాయకులు మద్దతు తెలిపితే.. విపక్ష పార్టీల సంబంధించిన నాయకులు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. భద్రత పరమైన పలు కారణాలతో తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ఈ సినిమాను బ్యాన్ చేశాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు మాత్రం ఈ సినిమాకి పన్ను మినహాయింపు ప్రకటించాయి. వివాదాల సంగతి పక్కన పెడితే ది కేరళ స్టోరీ భారీ వసూళ్లను సాధిస్తోంది.  

Also Read :  నేలపై కూర్చోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?

Advertisement

kerala-story-review

ఇప్పటివరకు రూ.56 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది ది కేరళ స్టోరీ మూవీ. వసూళ్లు రోజు రోజుకు పెరగడంతో ఈ సినిమాని అంతర్జాతీయంగా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు మూవీ మేకర్స్. రేపు అనగా మే 12న 37 దేశాల్లో ది కేరళ స్టోరీ మూవీ విడుదల కానుందని హీరోయిన్ ఆదాశర్మ వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టును షేర్ చేసింది ఆదాశర్మ. ది కేరళ స్టోరి సినిమాలో షాలినీ ఉన్ని  కృష్ణన్ పాత్రలో నటించి మెప్పించింది ఆదాశర్మ. 

Advertisement

Also Read :   ఓటీటీలో ఆది మూవీకి అద్భుతమైన రెస్పాన్స్..!

ముగ్గురు యువతులు మతం మారి, అనంతరం ఐసీస్ లో చేరిన నేపథ్యంలో కథ నడుస్తుంది. తప్పిపోయిన ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పని చేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారి తీసింది. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని విపుల్ అమృత లాల్ షా నిర్మించారు. ఆదాశర్మతో పాటు యోగితా బిహాని, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ కీలక పాత్రల్లో నటించారు. ది కేరళ స్టోరీ ఈనెలలో వచ్చిన సినిమాల్లో అత్యధికంగా వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. తెలుగులో కూడా ది కేరళ స్టోరీ విడుదలైన గోపిచంద్ రామబాణం, అల్లరి నరేష్ ఉగ్రం మూవీస్ విడుదలైనప్పటికీ ఆ సినిమా కంటే ఎక్కువగా ప్రేక్షకులు ది కేరళ స్టోరీపైనే ఆసక్తి కనబరచడం విశేషం. 

Also Read :  ఆ ఇద్దరూ హీరోల గురించి ప్రియమణి ఏమందో తెలుసా ?

Visitors Are Also Reading