Home » లుక్ మొత్తం మార్చేసిన మెగాస్టార్.. లేటెస్ట్ మెగా మేకోవర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

లుక్ మొత్తం మార్చేసిన మెగాస్టార్.. లేటెస్ట్ మెగా మేకోవర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ గా మారారు.  2008లో సినిమాలకు స్వస్తీ చెప్పి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తరువాత  కొద్ది రోజులకే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ తరువాత ఖైదీ నెంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు చింరజీవి. మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నాడు. ఇక తాను ఈ వయసులో కూడా తన లుక్ తో యాటిట్యూడ్ తో ఆకట్టుకుంటున్నాడు.

Advertisement

Advertisement

తాజాగా మెగాస్టార్ తన కొత్త మేకోవర్ తో మరోసారి మెగా ఫ్యాన్స్ మనసులు దోచుకున్నాడు. ఈయన కొత్త లుక్ అందరిని ఫిదా చేస్తుంది. మెగాస్టార్ తాజాగా ట్విట్టర్ లో తన ప్రొఫైల్ పిక్ ను చేంజ్ చేయగా ఆ పిక్ లో ట్రెండీ హెయిర్ స్టైల్, గాగుల్స్ పెట్టుకొని ఖాకీ కలర్ షర్టులో అదిరిపోయాడు. ఈయన ఈ పిక్ గత సినిమాలో లుక్స్ ను గుర్తుచేస్తుంది. చూస్తుంటే తన నెక్స్ట్ సినిమా కోసమే మెగాస్టార్ మేకోవర్ అని తెలుస్తుంది. ఈ పిక్ ను మెగా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా మెగాస్టార్ ఒకేసారి రెండు సినిమాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

Chiranjeevi

Chiranjeevi

ఆ రెండు సినిమాలపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. మరి మెగాస్టార్ ప్రకటించిన సినిమాల్లో మెగా 156 ఒకటి. ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమాను మూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను బింబిసార డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తున్న విషయం విధితమే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2025 సంక్రాంతి టార్గెట్ గా ఆడియన్స్ ముందుకు రానుంది.

Visitors Are Also Reading