Home » 1986 ముగ్గురు సీనియర్ హీరోలతో పోటీపడ్డ మెగాస్టార్..గెలిచింది ఎవరంటే..?

1986 ముగ్గురు సీనియర్ హీరోలతో పోటీపడ్డ మెగాస్టార్..గెలిచింది ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

1986 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి పోటీపడ్డాయి. ఈ ముగ్గురు స్టార్ హీరోల సినిమాల్లో ఏ మూవీ విజయం సాధించిందో ఇప్పుడు చూద్దాం..మెగాస్టార్ చిరంజీవి నటించిన కిరాతకుడు మూవీ జనవరి 1న విడుదలైంది. సుహాసిని హీరోయిన్గా నటించిన ఈ మూవీ కి ఇళయరాజా సంగీతం, కోదండరామిరెడ్డి డైరెక్షన్లో తెరకెక్కింది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద కాంబినేషన్లో కృష్ణ గారడి చిత్రం విడుదల అయింది. ఈ చిత్రం కూడా యావరేజ్ గా నిలిచింది.

Advertisement

 

ALSO READ;ఆ సినిమా వల్లే SR:ఎన్టీఆర్ 3 నెలలు ఇంటికే పరిమితం అయ్యారా.. జరిగిందేంటంటే..?

Advertisement

ఇక జనవరి 9న శోభన్ బాబు నటించిన శ్రావణ సంధ్య మూవీ విడుదలైంది. ఇందులో సుహాసిని,విజయశాంతి హీరోయిన్లు. ఈ మూడు సినిమాల్లో శ్రావణ సంధ్య సూపర్ హిట్ అయింది.జనవరి 10న భానుచందర్ రమ్యకృష్ణ,భానుప్రియ హీరో హీరోయిన్లుగా వచ్చిన భలే మిత్రుడు మూవీ విడుదల అయింది. కానీ ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత జనవరి 11న వచ్చిన రెండు రేళ్లు ఆరు విడుదల అయింది. రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ హీరోలుగా వచ్చిన ఈ చిత్రం హిట్ అయింది. ఆ తర్వాత మూడు రోజుల గ్యాప్ తో జనవరి 12న శోభన్ బాబు మరో చిత్రం డ్రైవర్ బాబు రిలీజ్ అయింది.

బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ రాధ. కానీ ఈ మూవీ కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన ఉక్కుమనిషి చిత్రం జనవరి 15న రిలీజ్ అయింది. ఈ మూవీ యావరేజ్ అయింది. ఇక జనవరి చివర్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మరో చిత్రం కొండవీటి రాజా విడుదలైంది. ఇందులో రాధా, విజయశాంతి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది.

ALSO READ;అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ ముగ్గురు వదులుకున్న సినిమాను రవితేజ చేసి సూపర్ హిట్ కొట్టాడు..?

Visitors Are Also Reading