Home » Ram Charan: రామ్ చరణ్ ను చిరు బెల్ట్ తో కొట్టారా? అసలు అప్పుడేమి జరిగింది?

Ram Charan: రామ్ చరణ్ ను చిరు బెల్ట్ తో కొట్టారా? అసలు అప్పుడేమి జరిగింది?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

మెగా ఫ్యామిలీ తండ్రి కొడుకులు చిరంజీవి, రామ్ చరణ్ ల బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రిని మించిన తనయుడిగా రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి ఫ్యాన్స్ గుండెల్లో నిలిచారు. రామ్ చరణ్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ చెప్పక్కర్లేదు. అయితే.. ఆయన పర్సనల్ ఫ్యామిలీ లోని విషయాలు కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా.. ఆయన లైఫ్ కి సంబంధించిన ఓ విషయం తెగ వైరల్ అవుతోంది.

Advertisement

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అన్న టాగ్ తో దూసుకెళ్తున్న రామ్ చరణ్ ను చిన్నతనంలో మెగాస్టార్ బెల్ట్ పెట్టి కొట్టారట. అసలు ఇదంతా నాగబాబు వల్ల జరిగిందట. ఇంతకీ అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి చరణ్ వాళ్ళ ఇంటిపక్కనే ఉండే అపార్ట్మెంట్ వాళ్ళ డ్రైవర్ ఎదో గొడవ పడి ఎవరితోనో బూతులు మాట్లాడాడట. అవే బూతులు రామ్ చరణ్ విని.. మరో సందర్భంలో నాగబాబు వద్ద రిపీట్ చేసాడట.

Advertisement

అయితే.. నాగబాబు ఈ విషయాన్నీ మెగాస్టార్ చిరంజీవికి చెప్పాడట. దీనితో కోపగించుకున్న చిరంజీవి రామ్ చరణ్ ను బెల్ట్ పెట్టి కొట్టారట. అసలెప్పుడు చెయ్యి చేసుకొని చిరంజీవి రామ్ చరణ్ బూతులు మాట్లాడేసరికి బెల్ట్ పెట్టి కొట్టేశారట. ఇంకెప్పుడు ఇలా మాట్లాడనని రామ్ చరణ్ చెప్పడంతో చిరంజీవి వదిలేసారట. దీనితో.. ఇదంతా నాగబాబు వల్లే వచ్చింది అంటూ చరణ్ ఫ్యాన్స్ నాగబాబు పై కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు : పవన్ కళ్యాణ్

ధోని కుట్ర చేశాడు.. కావాలనే రన్ అవుట్ అయ్యాడు – యువరాజ్ తండ్రి సంచలనం

టెస్టు క్రికెట్ కు వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్

Visitors Are Also Reading