Home » కూతురు సినిమాకు మెగాస్టార్ రివ్యూ..అద్భుతం అంటూ..!

కూతురు సినిమాకు మెగాస్టార్ రివ్యూ..అద్భుతం అంటూ..!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి సినిమాల‌ను చూడ‌టమే కాకుండా నచ్చిన సినిమాను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో షేర్ చేసుకుంటారు. అలా మెగాస్టార్ చాలా సినిమాల‌కు రివ్యూ ఇచ్చారు. అంతే కాకుండా మెగాస్టార్ విడుద‌ల‌కు ముందే చూసి రివ్యూ ఇచ్చిన చాలా సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి విల‌క్ష‌ణ న‌టుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ ముఖ్య‌పాత్ర‌లో న‌టించిన సేనాప‌తి సినిమాకు రివ్యూ ఇచ్చాడు. ఇందులో నరేశ్‌ అగస్త్య, హర్ష వర్థన్‌, జ్ఞానేశ్వరి, సత్య ప్రకాశ్ లు కూడా ముఖ్య పాత్రల్లో న‌టించారు. సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

chiranjeevi

chiranjeevi

ఈ చిత్రానికి ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌కత్వం వ‌హించారు. సుస్మిత కొణిదెల మ‌రియు విష్ణు ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాపై చిరు త‌న ట్వీట్ లో….సేనాప‌తి సినిమా చూసాను. ఈ సినిమాను దర్శ‌కుడు ప‌వ‌న్ ఎంతో ఆస‌క్తిక‌రంగా అనుక్ష‌ణం ఏం జ‌రుగుతుందా అని ఉత్కంట భ‌రితంగా తీశారు. మంచి అభిరుచికి అద్దం ప‌ట్టే య‌వ‌నిర్మాత‌లు సుస్మిత కొణిదెల‌, విష్ణుల‌కు నా అభినంద‌న‌లు.

Advertisement

also read : పెళ్లైతే ఇలానే వ‌దిలేసేదానివా..? దీప్తీకి శ్రీరెడ్డీ నీతులు..!

అన్నింటికి మించి న‌ట‌కీరిటి రాజేంద్ర‌ప్ర‌సాద్ అద్భుతంగా న‌టించాడు. త‌న న‌ట‌నా ప్ర‌తిభ‌కు ఈ సినిమా ఓ మ‌చ్చుతున‌క‌. ఈ ప్ర‌య‌త్నం వెన‌క ఉన్న గోల్డ్ బాక్స్ ఎంట‌ర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ‌కు అభినంద‌న‌లు. ఆహా ఓటీటీలో విడుద‌లైన ఈ చిత్రం ఖ‌చ్చితంగా మ‌న్న‌ల‌ను పొందుతుంద‌ని ఆశిస్తున్నాను. అంటూ ట్వీట్ లో పేర్నొన్నారు.

Visitors Are Also Reading