Telugu News » Blog » పెళ్లైతే ఇలానే వ‌దిలేసేదానివా..? దీప్తీకి శ్రీరెడ్డీ నీతులు..!

పెళ్లైతే ఇలానే వ‌దిలేసేదానివా..? దీప్తీకి శ్రీరెడ్డీ నీతులు..!

by AJAY
Ads

సినిమాలు రాజకీయాలు, సామాజిక అంశాలు ఇలా టాపిక్ ఏద‌యినా అందులో దూరిపోయి ఏకిపారేయ‌డం ద‌ర్శ‌కుల్లో ఆర్జీవికి సొంత‌మైతే న‌టీన‌టుట్లో శ్రీరెడ్డికే సొంతం. ఇక తాజాగా శ్రీరెడ్డి రీసెంట్ గా బ్రేక‌ప్ చెప్పుకున్న జంట దీప్తి సునైనా ష‌ణ్ముక్ ల వ్య‌వ‌హారంపై స్పందించింది. అంతే కాకుండా ష‌ణ్ముక్ కు స‌పోర్ట్ చేస్తూ దీప్తిపై ఆరోప‌ణ‌లు చేసింది. బిగ్ బాస్ లో అమ్మాయితో క్లోజ్ గా ఉన్నాడ‌నే కార‌ణంతో బ్రేక‌ప్ చెబితే అంత‌కు ముందు బిగ్ బాస్ లో దీప్తి కూడా ఓ కంటెస్టెంట్ తో క్లోజ్ గా ఉందంటూ శ్రీరెడ్డి బాంబు పేల్చింది.

Advertisement

Advertisement

నీ వ‌రకూ వ‌చ్చేది అది త‌ప్పు కాదా అంటూ దీప్తిని ప్ర‌శ్నించింది. ఐదేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నామ‌ని ఎన్నో ఎత్తు ప‌ల్లాలు చూశామ‌ని నువ్వే చెప్పావు..ఇప్పుడు బిగ్ బాస్ లో మ‌రో అమ్మాయితో క్లోజ్ గా ఉన్నావ‌ని బ్రేక‌ప్ చెప్పావని క్లియ‌ర్ గా అర్థం అవుతోంది. మ‌రి నువ్వు బిగ్ కు వెళ్లిన‌ప్పుడు ఎంత క్లోజ్ గా ఉన్నావో నీ రిలేషన్ షిప్ ఏంటో అందరం చూశామంటూ రెచ్చిపోయింది. అప్పుడు ల‌వ్ ఏమో అని అనుమానం వ‌చ్చేట‌ట్టు ప్ర‌వ‌ర్తించావు అది త‌ప్పుగా అనిపించ‌లేదా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Advertisement

also read : జ‌గ‌న్ స‌ర్కార్ ను ఏమైనా అనాలంటే న‌న్ను దాటి వెళ్లాలి…ఆర్జీవికి శ్రీరెడ్డి స‌వాల్..!

అంతే కాకుండా పెళ్లి కాలేదు కాబ‌ట్టి బ్రేక‌ప్ చెప్పావు..అలాగే పెళ్లి అయితే వ‌దిలేసేదానివా అంటూ దీప్తిని ప్ర‌శ్నించింది. అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ఉంటుందని. మ‌నిషి అన్నాక త‌ప్పులు చేయ‌డం స‌హ‌జం అని శ్రీరెడ్డి పేర్కొంది. ఇద్ద‌రి మ‌ధ్య అండ‌ర్ స్టాండింగ్ ఉంటే ఒక‌రి త‌ప్పుల‌ను మ‌రొక‌రు క్ష‌మించుకోవాల‌ని కానీ ఇలా చేయ‌కూడ‌ద‌ని శ్రీరెడ్డి హిత‌వు ప‌లికింది. ఇదిలా ఉంటే కొంత‌మంది శ్రీరెడ్డి మాట‌ల‌ను స‌మ‌ర్ధిస్తుండ‌గా మ‌రికొంద‌రు మాత్రం ఆ నీతులు చెప్పొచ్చావులే అంటున్నారు.