Home » పూరి జగన్నాథ్ మంచి మోసగాడే.. సోషల్ మీడియాలో అభిమాని లెటర్ వైరల్..!

పూరి జగన్నాథ్ మంచి మోసగాడే.. సోషల్ మీడియాలో అభిమాని లెటర్ వైరల్..!

by Anji
Ad

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కి వ్యతిరేకంగా బయ్యర్లు కోర్టుకు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. బయ్యర్ల నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో పూరి జగన్నాథ్ ఇంటికి పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ చిత్ర యూనిట్ మొత్తానికి ఒక పీడ కలగా మారిపోయింది. పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ,చార్మి, అనన్యా పాండే ఇలా ఈ చిత్రంలో ఇన్వాల్వ్ అయినా ఎవరిని వదలకుండా నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఈ చిత్ర పరాజయం భారి నుంచి బయటపడేందుకు పూరి ప్రయత్నిస్తున్న తరుణంలో ఇంకా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. లైజర్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయినా బయ్యర్లు, ఎగ్జిబిటర్లు దారుణంగా నష్టాలు చవిచూశారు. వీరికి సాధ్యమైనంత అమౌంట్ సెటిల్ చేస్తానని పూరి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇంతవరకు పూరి జగన్నాథ్ తన మాట నిలబెట్టుకోకపోవడంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు పూరిపై పోరాటం చేసేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read : ఇప్పుడు ప్ర‌భాస్ మ‌రి 90S లో పాన్ ఇండియా స్టార్ ఎవ‌రో తెలుసా..? ఎలా అయ్యారంటే..?

Advertisement

పూరి జగన్నాథ్ కి వ్యతిరేకంగా బయ్యర్లు కోర్టుకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. బయర్ల నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో పూరి జగన్నాథ్ ఇంటికి పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. నష్టపోయిన వారికి డబ్బులు ఇచ్చేది లేదు అంటూ పూరి చెప్పినట్లుగా ఉన్న ఒక వీడియో వైరల్ కూడా అవుతుంది. పూరి పరువు తీసేందుకు కొందరు ఇలా పనిగట్టుకుని కుట్ర చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ అభిమానిని అంటూ ఒక వ్యక్తి రాసిన లేక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూరి జగన్నాథ్ ని అండగా నిలబడేలా ఆ అభిమాని ఈ లేక రాశారు. పూరి జగన్నాథ్ ప్రఖ్యాతిని మంచితనాన్ని తెలియజేసే విధంగా ఈ లేక ఉంది. ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ మైల్ స్టోన్స్ లాంటి సినిమాలను ఇచ్చి ఇప్పుడు ఇలాంటి కుట్రల మధ్య నలిగిపోతున్నందుకు కచ్చితంగా పరువు తీసేయాలి. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరికీ ఒక్కో మార్క్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కదా మోసగాడు అనే ముద్ర తప్పకుండా వేయాల్సిందే. దర్శకుడిగా, నిర్మాతగా తాను వందల కోట్లు నష్టపోయిన ఎప్పుడు ఎవరి పేర్లు బయట పెట్టనందుకు, ఎవరిని బాధ్యులను చేయకుండా పల్లెత్తి మాట కూడా అనకుండా ఉన్నందుకు పక్కాగా కుటుంబంతో సహా రోడ్డుకు లాగాలి.

Advertisement

అవును తాను సమాజంలో పరువుగా బ్రతకాలి అనుకుని ఇన్నాళ్లు ఎవరి పరువు తీయకుండా ఉన్నందుకు బుద్ధొచ్చేలా పరువు తీయాలి. తనను ఎంతమంది మోసగించిన ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా బ్లాక్ బస్టర్స్ తో బౌన్స్ బ్యాక్ అయ్యే డాషింగ్ డైరెక్టర్ ని ఇలాగే పరువు తీసి సత్కరించాలి. జీవితంలో సంపాదించుకున్న వన్నీ ఓసారి కోల్పోయి మళ్లీ ఒకటి నుండి జీవితాన్ని స్టార్ట్ చేసి ఈ స్థాయికి ఎదిగి చూపించాడు. అలా ఆదర్శంగా నిలిచినందుకైనా మనం పూరి తాట తీసేయాలి. పదండి ఇప్పటికైనా ఆలస్యమైంది. లేదు గొప్ప సినిమాలు గొప్ప హిట్స్ ఇచ్చినప్పుడు అన్ని మూసుకొని ఆయన ఇంటి చుట్టూ తిరిగిన రోజులను మర్చిపోయి, ఇప్పుడు విచక్షణ రహితంగా ప్రవర్తిద్దాం. ఎందుకంటే డబ్బుకున్న విలువ మనుషులకు లేని రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. అది నిజమని ప్రూఫ్ చేయడానికి అయినా పూరి జగన్నాథ్ పరువు తీసేద్దాం.

Also Read : సోష‌ల్ మీడియా లో ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేసిన నిత్యామీన‌న్‌.. అస‌లు విష‌యం ఏంటంటే ?

లైగర్ సినిమాతో అందరి కన్నా ఎక్కువగా నష్టపోయి అయినా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి ఎంతో కొంత ఆరెంజ్ చేస్తానని చెప్పిన మంచితనాన్ని నిందలు వేసి చంపేద్దాం. ఇంకోసారి ఇలా అన్ని కోల్పోయిన మంచితనంలో బ్రతకొద్దని, ఎవర్ని లెక్కచేయొద్దని, స్వార్థానికి ఎక్కువ వ్యాల్యూ ఇవ్వమని గుర్తు చేద్దాం. ఇక ఇడియట్, అమ్మానాన్న తమిళమ్మాయి, బద్రి, పోకిరి, దేశముదురు, బిజినెస్ మ్యాన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చినందుకు తనకు తానే సిగ్గుపడేలా తాట తీసేద్దాం. ఆల్రెడీ పూరి చెప్పినట్లుగానే సినీ ప్రపంచంలో పెద్ద గ్యాంబ్లింగ్ నడుస్తుంది. కాకపోతే సినిమా అనేది వ్యాపారంతో కూడిన జూదం. కొన్ని సినిమాలు ఆడతాయి. కొన్ని పోతాయి. మామూలుగా సినిమాలు పోతే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇచ్చేవాళ్ళు చాలా అరదు. అయితే లైగర్ విషయంలో నష్టపోయినందుకు డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇచ్చేందుకు పూరి సిద్ధపడ్డాడు. ఆ విషయాన్ని కూడా క్లియర్ గా చెప్పుకొచ్చాడు. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. సినిమా పోయిందని చెప్పి డబ్బులు తిరిగే అడుగుతున్నారు. అదే సినిమాలో బాగా ఆడి లాభాలు వస్తే వచ్చిన ఎక్కువ డబ్బులను తిరిగి ప్రొడ్యూసర్లకు ఇస్తారా ఆలోచించాలి అంటూ అభిమాని బయ్యర్లని, ఎగ్జిబిటర్ లని దుమ్మెత్తి పోస్తూ పూరీకి సపోర్టుగా ఈ లేక రాశారు.

Also Read : ఆలీ కూతురు పెళ్లికి సీఎం జగన్ గిఫ్ట్.. ఏంటంటే..?

Visitors Are Also Reading