Home » మెగా 154 టైటిల్ టీజర్ రిలీజ్.. అనుకున్నట్టే దీపావళి బ్లాస్ట్..!

మెగా 154 టైటిల్ టీజర్ రిలీజ్.. అనుకున్నట్టే దీపావళి బ్లాస్ట్..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ (కే. ఎస్. రవీంద్ర) తత్వంలో రూపుదిద్దుకుంటున్న తాజాగా మెగా అభిమానులు హుషారయ్యే విధంగా వదిలారు. దీపావళి సంబరాలను నింపుతూ.. టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. విడుదలైన కొద్ది క్షణాల్లోనే టైటిల్ టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభిమానులందరూ ఊహించిన విధంగానే సినిమా పేరును వాల్తేరు వీరయ్య గా ప్రకటించారు దర్శకుడు బాబీ.


మెగాస్టార్ అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా చిరంజీవి ఇంట్రడక్షన్ చూపించారు. నోట్లో బీడీతో పక్కా మాస్ లుక్కుతో దర్శనమిచ్చారు మెగాస్టార్. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇంకా చూడాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఈ చిత్రంలో మాస్ కమర్షియల్ అంశాలు ఉండే విధంగా ఖాతా ఉండనున్నట్టు సమాచారం. మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ అవుట్ ఫుట్ కోసం యూనిట్ అంతా శ్రమిస్తోంది. చిత్రంలో చిరంజీవితో పాటు రవితేజ కూడా నటిస్తుండడం విశేషం.

Advertisement

Advertisement

Also Read :  థియేటర్ లోకి రానున్న కలర్ ఫోటో..!

చిరంజీవి శాసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుక జనవరి 11, 2023 చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, యెర్నేని రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్నారు. మెగాస్టార్ నటన రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో వచ్చిన టైటిల్ టీజర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. టీజర్ ఇలా ఉంటే ఎలా ఉంటుందో అని అభిమానులు సినిమాపై ఆసక్తి పెంచుకుంటున్నారు. సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Also Read :   పవన్ తో సినిమా చేసి కెరియర్ పోగొట్టుకున్న హీరోయిన్స్.. ఎవరంటే..?

Visitors Are Also Reading