Home » థియేటర్ లోకి రానున్న కలర్ ఫోటో..!

థియేటర్ లోకి రానున్న కలర్ ఫోటో..!

by Azhar
Ad
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ చేసిన నష్టం అనేది అందరూ చూసారు. కరోనా కారణంగా ప్రపంచం దాదాపు ఆరు నెలలు స్తంభించింది అనేది తెలిసిందే. ఇక ఈ వైరస్ కారణంగా అన్ని రంగాలు మూత పడ్డాయి. ఇక సినిమా రంగంలో కూడా కరోనా భారీగా ప్రభావ చూపింది. షూటింగ్ పూర్తి అయ్యి రిలీజ్ కు సిద్ధమైన సినిమాలను విడుదల కాకుండా ఆపేసింది.
ఆ కారణంగా చాలా సినిమాలు అనేవి ఓటీటీని నమ్ముకున్నాయి. ఇక ఈ పద్దతి పెద్ద సినిమాలకు నష్టం చేస్తే చిన్న సినిమాలు లాభపడ్డాయి. అలాంటి సినిమాల్లో కలర్ ఫోటో కూడా ఒక్కటి. సుహాస్ హీరోగా ఆహలో విడుదల అయిన ఈ సినిమా అనేది సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కథ అలాగే ఇందులోని సహజత్వం సినీ అభిమానులకు బాగా నచ్చింది.
ఇక ఈ సినిమా హిట్ వల్లే కొన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్ కూడా సిద్ధమయ్యాయి. ఇక ఈ మధ్యే ఈ కలర్ ఫోటోకు జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు కూడా వచ్చింది అనేది తెలిసిందే. ఇక ఈ సినిమా వచ్చిన ఇన్ని రోజులకు ఇది థియేటర్ లోకి రానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలు.. వచ్చే నెల 19న కలర్ ఫోటోను థియేటర్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమాను ఫ్యాన్స్ థియేటర్ లో ఆదరిస్తారా లేదా అనేది.

Advertisement

Visitors Are Also Reading